పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/128

ఈ పుట ఆమోదించబడ్డది

యోబు నిస్వార్థపరుడని రుజువయింది. అతడు దేవుని కొరకే దేవుణ్ణి కొలుస్తున్నాడని తేలింది. పరీక్షలో పిశాచం ఓడిపోయింది. ఐనా అది తన ఓటమిని అంగీకరించలేదు. యోబు కపట భక్తుడనే దాని నమ్మకం.

రెండవ పరీక్షలో పిశాచం దేవునితో ఈలా వాదించింది. "యోబు ఆస్తిపాస్తులు పోయాయేగాని అతని ప్రాణానికేమీ ముప్ప వాటిల్లలేదు. నరుడు నమస్తాన్ని వదలుకొనైనాసరే తన ప్రాణాన్ని కాపాడుకోగోరుతాడు. మీ మట్టుకు మీరు యోబు శరీరానికి హాని తలపెట్టండి, అతడు మీ మొగం ముందటనే మిమ్ము శపించి తీరుతాడు" అంది - 2,4. దేవుడు రెండవసారిగూడ పిశాచం సవాలుని అంగీకరించాడు. "నేను యోబుని నీ యధీనంలో వుంచుతున్నాను. నీవు అతని ప్రాణాలు మాత్రం ముట్టుకోవద్దు" అన్నాడు - 2,4-6.

మొదటి పరీక్షలో పిశాచానికి యోబు ఆస్తిపాస్తులమీద మాత్రమే అధికారం లభించింది. ఈ రెండవ పరీక్షలో దానికి అతని దేహంమీద కూడ పెత్తనం లభించింది. అది యోబుని చంపకూడదు కాని, అతని శరీరానికి ఎన్ని బాధలయినా కలిగించవచ్చు.

సాతాను యోబు శరీరాన్ని అరికాలినుండి నడినెత్తి వరకూ ప్రణాలతో నింపింది. ఆ పండ్లనుండి చీమూ రసీ కారుతున్నాయి. అతన్ని చూచి అందరూ అసహ్యించుకొన్నారు. అతడు దుఃఖాన్ని భరించలేక జనానికి దూరంగా తొలగిపోయి ఓ దిబ్బమీద కూర్చున్నాడు. చిల్లపెంకుతో తన కురుపులను గోకుకో నారంభించాడు.

ఈలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో పానకంలో పుడకలా యోబు భార్య వచ్చింది. ఆమె పెనిమిటిని జూచి "నీవింకా దోషరహితుడవుగానే మనుగడ సాగిస్తున్నావా? దేవుడు నీకు ఇన్ని తిప్పలు పెట్టాడు. నీవు చావకముందు అతన్ని నోరార శపించి చావు అంది. కాని యోబు మహాభక్తుడు. ఇతరుల దుర్బోధలకూ ప్రలోభాలకూ లొంగేవాడు కాదు. అతడు భార్యతో "నీవు వట్టి తెలివితక్కువ దానిలా మాట్లాడుతున్నావు. దేవుడు మనకు శుభాలు దయచేసినపుడు హాయిగా అనుభవించాం. ఇపుడు కీడులను పంపితే మాత్రం స్వీకరించవద్దా?" అన్నాడు-2,9–10. ఈ మాటలతో అతడు స్వార్థపరుడు ఎంతమాత్రమూ కాదనీ, దైవచిత్తానికి లొంగివుండేవాడనీ రూఢిగా తేలిపోయింది. అన్ని దురదృష్ణాలు వాటిల్లినా యోబు దేవుణ్ణి పల్లెత్తి మాట అనలేదు.

ఇక్కడ యోబు భార్య మనందరిలాంటిది. మనమంతా లాభాలకోసం దేవుణ్ణి సేవిస్తాం. కష్టాలు రాగానే అతనిమీద సమ్మర్లపడతాం. అతన్ని విడనాడతాంగూడ. కాని యోబు మనలాంటివాడు కాదు. అతడు దేవునికోసమే దేవుణ్ణి కొలిచే భక్తుడు. దేవుడే