పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/123

ఈ పుట ఆమోదించబడ్డది

10. మోషేకు అనుయాయి యోషువా 27

మోషేకు చివరి రోజులు సమీపించాయి. అతని అబారీము కొండల్లోని నెబో శిఖరాన్నెక్కి కనాను దేశాన్ని కన్నులార చూసాడు. ఆ పిమ్మట అతడు చనిపోవాలి. కాని తాను మరణింపకముందు యిస్రాయేలీయులకు ఒక నాయకుణ్ణి ప్రసాదించమని అతడు దేవుణ్ణి వేడుకొన్నాడు. ప్రభువు యోషువాను అతనికి అనుయాయిని చేసాడు. కనుక మోషే యాజకుడైన యెలియాసరుముందు, ప్రజలముందు యోషువాపై చేతులు చాచాడు. అతనిశక్తి యోషువాలోకి దిగివచ్చింది. మోషే తనకు బదులుగా యోషువాను ప్రజలకు నాయకుణ్ణి చేసాడు.

మోషే నేరుగా దేవునినుండి ఆజ్ఞలు స్వీకరించాడు. ఏక నాయకుడుగా పనిచేసాడు. యోషువా ఈలాంటి నాయకుడు కాడు. అతడు యాజకుడైన యెలియాసరుమీద ఆధారపడాలి. ఈ యాజకుడు దేవుని చిత్తాన్ని యోషువాకు తెలియ జేస్తుంటాడు. ఆ దైవచిత్తం ప్రకారం యోషువా కార్యాలు జరిపిస్తుంటాడు. ప్రజలకా నాయకుడు లేని లోపం వుండదు. ఆ ప్రజలనులాగే నేడు మనలను కూడ దైవ మార్గాల్లో నడిపించే నాయకులుండాలి. వారికి మనం విధేయులమై యుండాలి కూడ.

11. సంఖ్యాకాండం - క్రైస్తవులు

నేడు ఈ గ్రంధం మనకు నేర్చే పారాలు ఇవి :

1. ఈ పుస్తకంలో యిస్రాయేలు ప్రజలు కనాను దేశం పొలిమేరలవరకు ప్రయాణం చేసారు. దారిలో ఎన్నో ప్రలోభాలకూ, శిక్షలకూ, క్షమాపణకూ గురయ్యారు. éਰe క్రైస్తవులమైన మనంకూడ ఈ లోకంనుండి పరలోకానికి యాత్ర చేస్తున్నాం. క్రైస్తవ జీవితం పెద్దయాత్ర. ఈ యాత్రలో మనంకూడ చాలసార్లు పడిపోతాం. కాని క్రీస్తు నాయకుడు మనలను పైకి లేపి ముందుకు నడిపిస్తాడు. అతడు మన తిరుగుబాట్లనూ, పాపకార్యాలను క్షమిస్తాడు. యిప్రాయేలు ప్రజలు ఎంత పాపులైనా ఆ యాదిమ కాలంలో వివిధ జాతుల మధ్య దేవునికి సాక్షులుగా నిల్చారు. నేటి పాపపు ప్రపంచంలో మనం కూడ క్రైస్తవ సాక్షులంగా వుండాలి. మన జీవితం దేవునికి మహిమ కీర్తి కలిగించేలా వండాలి.

2. ఎడారి కాలమంతా ప్రభువు యిప్రాయేలు మధ్య నెలకొనివున్నాడు. అతడు మందసంలో, మేఘంలో, గుడారంలో వుండి ఆ ప్రజను నడిపించాడు. ప్రయాణంలో రేయింబవళ్ళు వారికి దారి జూపిస్తూ వచ్చాడు. అతని సాన్నిధ్య బలంవల్లనే వాళ్ళు §කරණීරය ఓగులాంటి శత్రురాజులను జయించారు. మన్నా భోజనం వారికి దైవ సాన్నిధ్యాన్ని