పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/122

ఈ పుట ఆమోదించబడ్డది

పాటించడం ముఖ్యం. కనుకనే "బాలాకు తన యింటిలోని వెండి బంగారాలను త్రవ్వి నా నెత్తిన పెట్టినా నేను ప్రభువు ఆజ్ఞమీరి ఒక చిన్న పనికూడ చేయను" అన్నాడు 24, 13. యిప్రాయేలు ప్రజలు కూడ ఈలాంటి వాళ్ళగా తయారుకావాలి. దేవుని ఆజ్ఞలకు లొంగి జీవించాలి. ఇతడు నేడు మనకుకూడ ఆదర్శంగా వుంటాడు. ప్రభువు చిత్తాన్ని పాటించడం మన ధ్యేయం కావాలి.

9. బాలు పెయోరు సంఘటనం 25

ఈ యధ్యాయంలో రెండు సంఘటనలు వున్నాయి. మొదటిది పెయోరు సంఘటనం. మోవాబీయులు పెయోరు అనే తావులో బాలు దేవతను కొల్చేవాళ్ళ వాళ్ళు అక్కడ సంతానోత్సవాన్ని జరుపుకొంటున్నారు. వాళ్ళ బాలు దేవతను నరులకు జంతువులకు సంతానాన్ని ఇచ్చేవాణ్ణిగాను, భూమికి పంటలు ఇచ్చేవాణ్ణిగాను భావించి పూజించేవాళ్ళు ఈ పూజల్లో వ్యభిచారం కూడ వుండేది. యిప్రాయేలు ప్రజలు కూడ ఈ పూజల్లో పాల్గొని బాలుని ఆరాధించారు. మోవాబు స్త్రీలతో వ్యభిచారం చేసారు. అన్యదైవాలను పూజించవద్దని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు కదా! కనుక ఇక్కడ వాళ్ళ బాలునుకొల్చి భ్రష్ణులయ్యారు. కనుక దేవుడు ఆ ఉత్సవంలో పాల్గొన్నవారినందరిని వధించమని మోషేను ఆజ్ఞాపించాడు. అతడు సమాజంలోని పెద్దలద్వారా దోషులను చంపించాడు-25, 1-5.

పూర్వం బాలాకు రాజు యిస్రాయేలు ప్రజలను నాశం జేయగోరి విఫలుడయ్యాడు. కాని ఆ ప్రజలు పెయోరువద్ద దేవుని ఆజ్ఞమీరి తమ్ముతామే నాశంజేసికొన్నారు. ప్రభువు ఆ ప్రజలను ఆదరిస్తున్నా వారి పాపమే వారిని నాశం జేసింది.

రెండవ సంఘటనం ఇది. సిమీ అనే యిప్రాయేలీయుడు కోస్బీ అనే మిద్యాను జాతి స్త్రీని శిబిరంలోకి తీసికొనివచ్చి పెండ్లిచేసికొన్నాడు. ఈ కార్యం అన్యజాతి స్త్రీలను పెండ్డాడరాదనే మోషే ఆజ్ఞకు కేవలం వ్యతిరేకం. కనుక అహరోను మనుమడు, యెలియాసరు కుమారుడు ఐన ఫీనెహాసు ఈ యిద్దరినీ ఈటెతో పొడిచి చంపాడు. వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేసాడు. పై అక్రమ వివాహంవల్ల ప్రభువు ప్రజల మీదికి అంటురోగాన్ని పంపాడు. కాని దోషుల వధవల్ల ఆ రోగం సమసిపోయింది. ప్రభువు ఫీనెహాసు ఆసక్తినీ భక్తినీ మెచ్చుకొని అతని వంశజులు శాశ్వతంగా యాజక వృత్తిలో కొనసాగుతారని వాగ్దానం చేసాడు. వీళ్లే సాదోకు తెగకు చెందిన యాజకులు. ఈ వర్గం యూజకులను సమర్ధించడానికే రచయితలు ఈ కథను బైబుల్లో చేర్చారు. ప్రభువు మనలను తన ప్రజలనుగా చేసికొన్నంత మాత్రాన్నే చాలదు. మన అంతస్తుకి తగినట్లుగా మనం యోగ్యంగా జీవించాలి. 114