పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/115

ఈ పుట ఆమోదించబడ్డది

చెందగూడదు. రోజువారి జీవితంలో మన అసూయను ఎప్పటికప్పడు గుర్తించి సవరించుకొంటుండాలి. ఈ దుర్గుణం మనలోకి ఎప్పడు ప్రవేశిస్తుందో మనకు తెలియదు.

4. వేగు చూడబోయినవారి కథ 13-14

యిస్రాయేలు ప్రజలు ఎడారిలో కాడేషు బార్నెయా వద్ద వున్నారు. ఈ తావు కనాను దేశానికి దక్షిణాన, దగ్గరలో వుంది. ఇక్కడినుండి మోషే వేగులవాళ్ళను కనాను దేశానికి పంపాడు. గోత్రానికి ఒక్కడు చొప్పన మొత్తం 12 మంది వెళ్ళారు. వారిలో కాలేబు, యోషువా ముఖ్యలు. ఇక్కడే మోషే హోషేయా పేరును యెహోషువాగా మార్చాడు. దేవుడు రక్షిస్తాడు అని ఈ క్రొత్త పేరుకి అర్థం. మోషే తర్వాత యిస్రాయేలు ప్రజలను కనాను భూమికి చేర్చేది ఈ యెహోషువాయే. ఈ పేరు మార్పులోనే అతని భవిష్యత్ కార్యక్రమం సూచింపబడింది. వేగులవాళ్ళు కనాను దేశంలోని నగరాలనూ, ప్రజలనూ, భూములనూ, పంటలనూ చూచిరావాలి.

గూఢచారులు 40 రోజుల తర్వాత తిరిగి వచ్చి మోషేకు సమాచారం తెలిపారు. ఆ దేశంలో పెద్ద నగరాలున్నాయి. పంటలు బాగానే పండుతున్నాయి. కాని అక్కడి ప్రజలు దీర్ఘకాయులు. విశేషంగా అనాకు వంశజులు రాక్షసులు. వారిముందు మేము మిడతల్లా కన్పించాం. వారిని మనం గెల్వలేము. కనుక మనం అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పారు. కాలేబు మాత్రం మనం ఆ దేశం మీదికి వెళ్ళి దాన్ని జయిద్దాం అన్నాడు. అబ్రాహాం కాలంలోనే దేవుడు ఈ దేశాన్ని యిస్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పడు ఈ చారులు మనం అక్కడకు వెళ్ళకూడదు అంటే దేవుని ప్రణాళికను ధిక్కరించినట్లే గదా!

ప్రజలు ఈ చారుల సమాచారాన్ని విని భయపడ్డారు. మోషేమీద తిరుగుబాటు ప్రారంభించారు. మోషేను రాళ్ళతో కొట్టి చంపబోయారు. ఇంకో నాయకుణ్ణి ఎన్నుకొని ఈజిప్టుకి తిరిగి పోదాం, అక్కడి దాస్యమే మెరుగు అన్నారు. కనాను దేశానికి వెత్తే ఓడిపోతామని వారి భయం. కాలేబు, యోషువా, దేవుడు ఆ దేశప్రజలు మనకు ఓడిపోయేలా చేస్తాడు అని వాదించారు. కాని ప్రజలు వారి మాటలను నమ్మలేదు.

అప్పడు దిడీలున ప్రభువు తేజస్సు కన్పించింది. అతడు ఆ తిరుగుబాటుదారులను నాశం జేయబోయాడు. మోషేతో నేను ఈ ప్రజలను తుడిచివేసి నీ ద్వారా క్రొత్త జాతిని పుట్టిస్తాను అన్నాడు. కాని మోషే స్వార్థంలేని మహానాయకుడు. అతడు ప్రభువుతో నీవు ఈ ప్రజను నాశం చేయవద్దు. పూర్వం నీవు మా పితరులతో చేసికొన్న నిబంధనం నిలబెట్టుకో. ఇప్పడు నీవు వీరిని శిక్షిస్తే ఈ చుట్టుపట్ల వున్న జాతులు నిన్ను