పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

2.కిబ్ర్ర్ర్రొతు హట్టావా వద్ద నిషురాలు 11,4-85

ఇదికూడ స్థలనామాన్ని తెలిపే కథే. కీబ్రోతు హట్టావా అనేపేరు ఎందుకు వచ్చిందో ఈ సంఘటనం చెప్తుంది.

ఇక్కడ రెండు కథలున్నాయి. మొదటిది ప్రజలు నీస్త్టురాలు పలికితే దేవుడు వారికి మాంసాన్నిచ్చాడు. రెండవది, మోషేకు సహాయం చేయడానికి దేవుడు 70 మంది పెద్దలను నియమించాడు. మూల రచయితలు ఈ రెండు సంఘటనలను కలిపివేసారు. కాని మనం వీటిని విడివిడిగా చూడాలి.

1. యిప్రాయేలీయులూ వారితో వచ్చిన అన్యజాతి ప్రజలూ కూడ తినడానికి మాంసం ఈయమని మోషేమీద తిరగబడ్డారు. మేం ఐగుపులో చేపలూ కూరగాయలూ తిన్నాం. ఇక్కడ దిక్కుమాలిన మన్నావొక్కటే దొరుకుతుంది అన్నారు. మోషే వారి ఫిర్యాదును దేవునికి తెల్పాడు. ఇంతమందికి నేనెక్కడ మాంసం తెచ్చిపెట్టగలను? ఈ జనాన్ని తల్లిలా, దాదిలా సాకవలసింది నీవుగాని నేనుకాదు అన్నాడు.

ప్రభువు ప్రజల అవిశ్వాసానికి వారిపై కోపించాడు. ఐనా వారికి సముద్రం మీదినుండి పూరేడు పిట్టలను పంపాడు. ఇవి వలస పక్షులు. సముద్రం మీదిగా ఎగిరివచ్చి యిస్రాయేలు శిబిరంలో వాలాయి. ప్రజలు ఆశతో ఒక్కొక్కరు 50 బుట్టలు నిండిందాకా వాటిని పట్టుకొన్నారు. కాని వాళ్ళు ఆ పక్షుల మాంసాన్ని నోటిలో పెట్టుకోగానే దేవుడు అంటురోగాన్ని పంపి వారిని చంపివేసాడు. చచ్చిన వారిని అక్కడే పాతిపెట్టారు. కావుననే ఆ తావుకి కిట్రోతు హట్టావా అని పేరు వచ్చింది. అనగా ఆసబోతుల సమాధులు అని అర్థం. దురాశతో మాంసాన్ని తినబోయి ప్రజలు అలా నశించారు. ప్రజల్లో మాంసం తిననివాళ్ళు మాత్రమే బ్రతికున్నారు అనుకోవాలి. తిండిపట్ల దురాశ పనికిరాదనీ, కేవలం కూటికొరకు దేవునిమీద తిరగబడరాదనీ ఈ కథ నీతి.

2. ఇక రెండవ కథ. ఈ ప్రజల బాగోగులను నేనొక్కట్టే విచారించలేను అని మోషే దేవునికి మొరపెట్టాడు. నీవు నన్ను చంపివేస్తే బాగుంటుందని వాపోయాడు. ప్రభువు అతనికి సహాయకులుగా 70 మంది పెద్దలను నియమించాడు. మోషే ఆత్మను కొంత తీసికొని వారికిచ్చాడు. అనగా అతని ప్రవచనశక్తి వారికికూడ కొంత లభించిందని భావం. ఈ శక్తితోనే వాళ్ళకూడ ప్రవచనం చెప్పారు. ఇక్కడ ప్రవచనమంటే దేవుణ్ణి స్తుతించడమే. ప్రజలకు ప్రధాన నాయకుడు మోషే వొక్కడే. ఈ పెద్దలు అతనికి సహాయకులుగా వుంటారు.