పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది



5. మూల భాషలు, అనువాదాలు

పూర్వ వేదాన్ని చాలవరకు హీబ్రూ భాషలోనే వ్రాసారు. కొన్ని పుస్తకాలనూ లేదా వాటి భాగాలనూ అరమాయికుభాషలోను, గ్రీకులోను గూడ వ్రాసివుంటారు. నూత్న వేదాన్ని పూర్తిగా గ్రీకులోనే వ్రాసారు.

హిబ్రూ పూర్వవేదానికి మాసారటిక్ హీబ్రూ బైబులు అని పేరు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చేయబడిన గ్రీకుఅనువాదానికి సెపవాజింత్ బైబులు అని పేరు. క్రీస్తుశకం 4వ శతాబ్దంలో జెరోము చేసిన లాటిను అనువాదానికి వల్లేట్ అని పేరు.

ఇంగ్లీషు అనువాదాల్లో జెరూసలేం బైబులు, గూడ్న్యూస్ బైబులు శ్రేష్టమైనవి. తొలిదానిలో చక్కని వివరణలు లభిస్తాయి. రెండవ దానిలో అనువాదం చాలా సరళంగా వుండి మూల గ్రంథకర్తల భావం సులువుగా బోధపడుతుంది. ఆరెస్వీ బైబులు కూడ ముఖ్యమైందే.

తెలుగులో ప్రోటస్టెంటు బైబులు చాల కాలం నుండి సంపూర్ణంగా లభ్యమౌతూంది. కాని దానిభాష నేటి యాంధ్రభాషకు తగినట్లుగా వుండదు. ఇంతకంటె మెరుగైన భాషలో క్యాతలిక్ అనువాదం ఇటీవలే అచ్చయింది.

6. బైబులు రచనోద్దేశం

భగవంతుడు తన్ను గూర్చి, తాను నరులకు రక్షణాన్ని దయచేసే తీరును గూర్చీ తెలియజేయడానికి బైబులు వ్రాయించాడు. దాని ప్రధానోద్దేశం ఇదే. చరిత్రనుగాని, శాస్త్రజ్ఞానాన్నిగాని తెలియజేయడంగాని ఆ గ్రంథం ఉద్దేశం కాదు. వేదగ్రంథాలను సత్యాన్ని బోధించడంకొరకే వ్రాసారు అన్నాడు క్రీస్తు అనుసరణ గ్రంథకారుడు - 1,5,1. కనుక రక్షణసందేశాన్ని తప్పితే మరో అంశాన్ని దానిలో వెదకకూడదు.

7. బైబులు అర్దాలు.

బైబులుకు చాలా అర్ధాలున్నాయి. ఈ యర్గాలన్నిటి ప్రకారం పండితులు దాని వాక్యాలకు వివరణం చెప్పవచ్చు. మొదటిది, చారిత్రకార్థం. ఇది గ్రంథం వ్రాసిన రచయిత చారిత్రకంగా ఉద్దేశించిన అర్థం. ఉదాహరణకు, అతడు యెరూషలేమును పేర్కొన్నప్పుడు యూదుల రాజధాని నగరమైన యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించాడు. అన్ని అర్థాలకంటె ఈ చారిత్రక అర్థం ముఖ్యమైంది, బైబులుకి వివరణం చెప్పేప్పడు.

రెండవది, పరిపూర్ణార్థం. పూర్వవేదంలో చెప్పిన అంశాలు కొన్ని నూత్నవేదంలో నెరవేరాయి. అలా నెరవేరినప్పడుగాని వాటి పరిపూర్ణార్థం బయటపడలేదు. ఈ పరిపూర్ణార్థం పూర్వవేద రచయితకు తెలియదు. ఉదాహరణకు "నా దేవా నా దేవా