పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/107

ఈ పుట ఆమోదించబడ్డది

- నిర్గ 33, 11. ప్రభువు తన మహిమను కాక పోయినా పేరును అతనికి వెల్లడిచేసాడు. మేఘంలోనుండి అతన్ని తన ప్రజలకు నాయకునిగా ప్రకటించాడు - 19,9.

2. విమోచకుడూ, నిబంధన మధ్యవర్తీ

ఐగుప్తునుండి ప్రజలను గొర్రెలమందనులాగ నడిపించుకొని వచ్చాడు మోషే - కీర్త 77,21. అతడు సీనాయివద్ద ప్రభువుకి నిబంధనబలి అర్పించాడు. ప్రభువు అతని నాయకత్వం క్రింద ప్రజలతో నిబంధనం చేసికొన్నాడు — నిర్గ24, 3–8. మోషేను అనుసరించినవాళ్ళంతా నిబంధనప్రజలు - 1 కొ10,2. అతడు ప్రజలకు నాయకుడూ వారి విమోచకుడూను - అ.చ. 7,35. ఇంకా అతడు నిబంధనకు మధ్యవర్తి. ఈ క్రియలో అతడు రానున్న నూత్నవేద మధ్యవర్తి క్రీస్తుకు సూచక వ్యక్తి - హెబ్రే 8,6.

3. ప్రవకా, ధర్మశాస్త్రప్రదాతా

మోషేవంటి ప్రవక్త పూర్వవేదంలో మల్లా పుట్టలేదు - ద్వితీ 34,10. పైగా అతడు ధర్మశాస్త్రప్రదాత. అందుకే యిప్రాయేలీయులకు అతడంటే పరమ గౌరవం. హిందూ సంద్రాయంలో ధర్మశాస్త్రకారుడు మనుపుకి ఎంత ప్రశస్తివుందో యూద సంప్రదాయంలో మోషేకు అంత ప్రశస్తివుంది.

4. విజ్ఞాపనకారుడు

మోషే ప్రార్ధనాపరుడు. అతడు చాలసార్లు యిస్రాయేలీయుల కొరకు ప్రభుని ప్రార్ధించాడు. యోషువా అమాలెకీయులతో యుద్ధం చేస్తుండగా తాను కొండమీదికివెళ్ళి తన ప్రజకు విజయం ప్రసాదించమని ప్రభువుని మనవిచేసాడు - నిర్గ 17,9–13. ప్రజలు దూడను ఆరాదించినందుకు యావే వాళ్ళను నాశం చేయబోయాడు. కాని మోషే ప్రార్ధనచేసి ప్రభువు కోపాన్ని చల్లార్చాడు - 32,11-14. ఆ సందర్భంలో అతడు యావే యిస్రాయేలీయులను మన్నింపనొల్లకపోతే తన పేరును ఆ ప్రభువు గ్రంథంలోనుండి కొట్టివేయవలసిందనిగూడ మనవిచేసాడు. అతని చిత్తశుద్ధిని నిరూపించడానికి ఈ యొక్క వుదాహారణం చాలు - 32,31. యెషయా తన ప్రవచనం 53,12 లో ఒక బాధమయసేవకుడు ప్రజల తరపున విజ్ఞాపనం చేసినట్లుగా వర్ణించాడు. ఆలాంటివాడే ఈ మోషేకూడాను.

5. మోషే వినయమూ, బాధలూ

భూమిమీది నరులందరికంటెగూడ వినయవంతుడు మోషే - సంఖ్యా 12,3. ప్రభువు మోషే ఆత్మను డెబ్బదిమంది పెద్దలకు పంచియిచ్చాడు. వాళ్లు ఆవేశంతో ప్రవచనం