పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/106

ఈ పుట ఆమోదించబడ్డది

సోదర ప్రేమతో మెలిగేకాడగూడ అతని సాన్నిధ్యం వుంటుంది. అతడు “మీరు నా సోదరులకు ఉపకారం చేసారు కనుక అది నాకు చేసినట్లే భావిస్తాను” అంటాడు - మత్త 25,40. ఇవన్నీ వరప్రసాద రూపమైన ప్రభుసాక్షాత్కారానికి ఉదాహరణలు. ఈలా పరిశుద్దాత్మ కలిగించే క్రీస్తు సాన్నిద్యం నానారూపాల్లో వుంటుంది.

2. దివ్యసత్ర్పసాదంద్వారా

పూర్వవేదంలో దైవమందసం చేసిన రక్షణకార్యాలన్నీ నూత్న వేదంలో మళ్లా దివ్యసత్ర్పసాదం కూడ చేస్తుంది. అది మనకు దైవచితాన్ని తెలియజేస్తుంది. ఇహలోకయాత్రలో దారి చూపించి మనలను ముందుకు నడిపిస్తుంది. శత్రువులనుండి మనలను కాపాడుతుంది.

ప్రభువు మోషేతో మిత్రునిలాగ ముఖాముఖి మాట్లాడాడు. ఇక్కడగూడ ప్రభువు మీరు నా సేవకులుగాదు, స్నేహితులు అంటాడు - యోహా 15,15. ఇక్కడగూడ ప్రభువు మన భారం తొలగిస్తాడు. "భారంచేత అలసివున్న వాళ్ళంతా నాచెంతకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను” అంటాడు - మత్త 11,28. కనుక ఆ తూర్పుదేశపు జ్ఞానుల్లాగే ఇక్కడ మనం ఆ ప్రభువుముందు ప్రణమిల్లాలి - మత్త 2,11.

8. మహానాయకుడు మోషే

ఐగుప్త నిర్గమనంలో ప్రముఖపాత్ర మోషే. అతని నాయకత్వం ద్వారానే యావే ప్రజలను ఐగుపునుండి నడిపించుకొనివచ్చాడు. ఈ యధ్యాయంలో మోషే వ్యక్తిత్వాన్ని కొద్దిగా పరిశీలించిచూద్దాం.

1. దేవునికి సేవకుడూ, మిత్రుడూ

మోషే బానిసల కుటుంబంలో పుట్టినవాడు. ఫరో కూతురు అతన్ని నైలునదినుండి రక్షించి దత్తు తీసికొంది. ఆమె అతనికి ఐగుప విద్యలన్నీ నేర్పించింది — అ చ 7,22. మోషే నాయకుడు కాకమునుపు స్వీయజనుల అనిష్ణానికి గురయ్యాడు. ఫరోకు దడిసి మిద్యానుకు పారిపోయాడు, ఎడారిలో దేవుడు ప్రత్యక్షమై తన పేరు రక్షణప్రణాళికా అతనికి తెలియజేసాడు - నిర్గ 3,13-15. ప్రభువు తన్ను ఫరోవద్దకు పంపబోగా మోషే మొదట తప్పుకోజూచాడు - 3,11. కాని యావే అతనికి తోడై యుంటానని బాస చేసాడు. ఐనా మోషే నేను నత్తివాడనని చెప్పి వెనుకాడాడు. కాని చివరకు ప్రభువు సేవకుడుగా పనిచేయడానికి అంగీకరించాడు. మెరీబావద్ద రాతిచుట్టును చరిచినప్పడు అతని నమ్మిక కొంచెం చలించింది. - సంఖ్యా 20,10. ఐనా అతడు ప్రభువుని విశ్వసించిన భక్తుడు. అనన్య చిత్తంతో యావేను సేవించినవాడు. దేవుడు అతనితో స్నేహితుల్లాగ మాట్లాడాడు