పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/105

ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమేఘం అన్నారు. ఇక, మేఘం గుడారంమీద వాలివున్నంతకాలం యిస్రాయేలీయులు విశ్రాంతి తీసికొనేవాళ్లు, అది గుడారంమీదినుండి పైకి లేవగానే వాళ్లు ప్రయాణం సాగించేవాళ్లు, అది ఎక్కడ ఆగిపోతే వాళ్లు అక్కడే ఆగి విడిది పన్నేవాళ్లు, ఈలా అది వాళ్ళను వాగ్రత్తభూమికి నడిపించుకొని పోయింది. - నిర్ణ 40,36-38.

3. కాపాడ్డం

రెల్లుసముద్రం వొడ్డున ఐగుప్రీయులు యిప్రాయేలీయులను కలసికొన్నారు. వాళ్లు యిస్రాయేలీయులను మళ్లా బలవంతంగా పట్టుకొని తీసుకపోవడానికి వచ్చారు. అంతవరకు యిస్రాయేలీయుల ముందు నడుస్తున్న మేఘం వెనుకకు వచ్చి వాళ్ళకూ ఐగుప్తియులకూ మధ్య నిలిచింది. అది యిప్రాయేలీయులవైపు వెలుగునీ ఐగుప్రీయులవైపు చీకటినీ ప్రసరించింది. ఆ చీకటిలో శత్రువులు యిస్రాయేలీయులను చూడలేకపోయారు. వాళ్లకు ఏహానీ చేయలేకపోయారు. ఆలా మేఘం వాళ్లను కాపాడింది - 14,19-20.

4. నూత్నవేద సాన్నిధ్యం

యావే పూర్వవేద ప్రజలకులాగే క్రీస్తు నూత్నవేద ప్రజలకు ప్రత్యక్షమై వుంటాడు. నేడు క్రీస్తు మనకు సాక్షాత్కారమయ్యే మార్గాలు రెండు.

l. ఆత్మద్వారా

అతడు మన యిమ్మానువేలు - మత్త 1,23. లోకాంతం వరకు మనతో వుండేవాడు - 28,20. కాని ఉత్తానమై తండ్రివద్దకు వెళ్ళిన క్రీస్తు నేడు మనతో ఏలా వుండగలడు? ఆత్మద్వారానే. క్రీస్తు వెళ్ళి రెండవ నాయకుడైన ఆత్మను పంపాడు - యోహా 16,7. ఈ యాత్మే ఉత్తాన క్రీస్తుని మనకు ప్రత్యక్షం చేస్తుంది - 1కొ 12,3.

ఆత్మ అనుగ్రహం వరప్రసాదం. కనుక వరప్రసాద రూపంలో కూడ ప్రభువు మనకు ప్రత్యక్షమౌతాడు. క్రీస్తు వచ్చి మన హృదయాన్ని మెల్లగా తడతాడు. ఏ భక్తుడైనాసరే అతని స్వరాన్ని ఆలించి హృదయకవాటాన్ని తెరిస్తే అతడు లోనప్రవేశిస్తాడు. తాను ఆ భక్తునితో భుజిస్తాడు. అనగా ప్రభువు అతనికి స్నేహితుడై వుంటాడు - దర్శన 3,20. ఇంకా క్రీస్తుని ప్రేమించే నరుడు అతని ఆజ్ఞలు పాటిస్తాడు. అప్పడు ప్రభువూ అతని తండ్రీ విజయంచేసి ఆ భక్తునితో వసిస్తారు - యోహా14,23.

పూర్వవేదంలో ధర్మశాస్త్రం చదివి విన్పించే భక్తసమాజంలో ఆ ప్రభువు నెలకొనివుండేవాడు. ఆ సాన్నిధ్యానికి "షెకీనా" అనిపేరు. హీబ్రూ భాషలో పెకీనా అంటే నివాసం. ఇక నూత్నవేదంలోకూడ ఎక్కడైనా క్రీస్తు పేర ఓ బృందం సమావేశమైతే దాని మధ్యలో ఆ క్రీస్తు నెలకొని వుంటాడు - మత్త 18,20. అతడు మన పెకీనా, నరులు