పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/104

ఈ పుట ఆమోదించబడ్డది

10,33. ఈలా మందసంమీది నుండి దేవుడు ప్రజలను నడిపించడం మాత్రమేకాదు, తాను వాళ్లపక్షాన యుద్ధం చేసేవాడు. అతడు రణవీరుడు. అందుకే మందసం సాగినప్పడెల్ల మోషే 'యావే! కదలిరా! నీ శత్రువులు చెదరిపోవాలి” అనేవాడు. మందసం ఆగినప్పడెల్ల “యావే! మరలిరా! నీ వేలాది ప్రజలవద్దకు తిరిగిరా" అనేవాడు - సంఖ్యా 10,35-36. మందసం మీది యావే సహాయంతోనే యోషువా యెరికోను ఆక్రమించుకొన్నాడు - యోషు 6,12–21. అతని సహాయంతోనే యోర్గాను నదిని దాటాడు - 3,14-18. ఈలా మందసంలోని దేవుడు ఆ ప్రజను నడిపించాడు.

2. గుడారం

దైవసాన్నిధ్యాన్ని ప్రసాదించిన రెండవ వుపకరణం గుడారం. యూదులకు మనకులాగ ఇండు వుండేవిగావు, గుడారాల్లోనే జీవించేవాళు. వాళ్ళ దేవుడుకూడ గుడారంలోనే వసించాడు. కనుక మందసంలోలాగే గుడారంలోకూడ ప్రభువు నెలకొనివుండేవాడు. యూదభక్తులు ఈ గుడారంలో దేవుణ్ణి కలసికొని అతని సందేశాలనూ సలహాలనూ స్వీకరించేవాళ్లు, కనుకనే దానికి సమాగమప గుడారం అని పేరు. ఓ మేఘం ఈ గుడారం ద్వారాన్ని కప్పతూండేది. గుడారం మధ్యలో తెరవండేది. ఆ తెరవెనుక మందసం వుండేది. తెర ముందట నిలుచుండి భక్తులు యావే దర్శనం చేసికొనేవాళ్లు, ఇక్కడ విశేషంగా యావే మోషేతో మాటలాడేవాడు. స్నేహితుడు స్నేహితునితో లాగే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించేవాడు. భక్తులకూ భగవంతునికీ గల సన్నిహిత సంబధాన్ని సూచించే పూర్వవేద ఘట్టాల్లో ఇది ప్రశస్తమైంది — నిర్గ 83, 7-11. ఎడారికాలంలో గుడారమే దేవాలయం. భక్తులు ఈ గుడారంలో సమావేశమై అక్కడ వెలసివున్నదేవునికి మ్రొక్కుకొనేవాళ్లు.

3. మేఘస్తంభం

దైవసాన్నిధ్యాన్ని ప్రసాదించిన మూడవ వుపకరణం మేఘం. ఇది మూడు పనులు చేసింది.

1. సాన్నిధ్యం:

మేఘంలో దైవసాన్నిధ్యం నెలకొనివుండేది. అది గుడారంముందు వాలివుండేది. మోషే గుడారంలోకి వెళ్ళగానే దేవుడు మేఘంలోనుండి అతనితో మాటలాడేవాడు - నిర్గ 33,9.

2. నడిపించడం

ఎడారికాలం నలబై యేళూ మేఘం యిస్రాయేలీయులను నడిపించుకొని వెళ్ళింది. ఇది గుడారానికి కమ్ముకొని వుండేది. రాత్రుల్లో అగ్నిలా మెరుస్తుండేది. కనుకనే దాన్ని