ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

భోజరాజీయము ఆశ్వా 3


వ.

ఇట్లు పుష్పాపచయాపదేశంబున నారామ లారామం బంతయుఁ దమమయంబ
కా విహరించి సరసాలాపంబులు నెఱయ మెఱయుచుండఁ గ్రమక్రమంబున.

39


ఉ.

నీరధిఁ గాలకూటము జనించినయ ట్లరుదెంచె గ్రీష్మ మీ
ధారుణిఁ, గృత్తివాసుఁ డది దాఁ గబళింపఁ గడంగుభంగి నే
పారెఁ బయోదవేళ, సుర లంతట సంతస మందినట్టు లం
భోరుహజృంభణం బమరఁ బొల్చె శరత్సమయంబు పెంపునన్.

40


క.

మడుఁగులు, బావులు, కొలకులు
వడి వెట్టిన యమృతరసము వడువున నిండా
రెడు నిర్మలజలములచేఁ
గడు రమ్యంబు లయి జగతిఁ గడుఁ బొగ డొందెన్.

41


వ.

అయ్యవసరంబున.

42


క.

సలిలవిహారక్రియలకుఁ
దలకొనుమదితోడ నృపసుతారత్నము నె
చ్చెలిపిండుతోడ నా పు
వ్విలుతుని [1]దీమంబు వోలె వెలువడి యొకచోన్.

43


చ.

చిగురుల పెంపుఁ, [2]గ్రొన్ననలవెన్నును, బువ్వులసొంపునై కడుం
బొగడఁగ నొప్పుశాఖల నభోవలయంబు నతిక్రమించి, మిం
చగు తరువాటికాతటమునందు మహాత్ములచిత్తవృత్తియ
ట్లొగిఁ గడు స్వచ్ఛమైన కొల నొక్కటి చేరి మహాముదంబునన్.

44


సీ.

తొలిఁదొలిఁ జొర నోడు చెలువలచిత్తముఁ
       దెలిపి యాటలకు మైకొలిపి కొలిపి
యోలోల యవి లీల నో ర్తోర్తుఁ దేర్కొని
       పరువడి చెయ్యీక పారి పాఱి
యాదట నితరేతరాస్యపద్మములపై
       గరయంత్రధారలు పఱపి పఱపి
వికచపద్మపరాగవిసరంబు పుచ్చి చే
       సాఁచి యొండొరులపైఁ జల్లి చల్లి

  1. దీపంబువోలె
  2. గ్రొన్నెలల