ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీఠిక

ఈ భాస్కరశతకమును రచించిన పలువురు పలువిధములగు గాధలను జెప్పుచున్నారు. ఈ శతకము నిరువురు కవులు రచియించిరని కొందఱును, ఒక్కడే రచించెనని మరికొందఱును జెప్పుచున్నను బ్ర. కేతవరపు వేంకటశాస్త్రిగారు చెప్పినట్లు శైలినిబట్టియు, చెన్నపురిలోని దొరతనమువారి ప్రాచ్యలిఖితపుస్తకాలములోని గ్రంథమునుబట్టియు నీ భాస్కరశతకమును మారనవెంకయ్యయను కవియొకడే రచించెననుట సమంజసము. కవి యెవ్వడైననేమి ! ఎందఱైననేమి ! దీనియందలి నీతుల కానందింపవలయును. ఈతడు సూర్యోపాసకు డగుటచే భాస్కరాయను మకుటముతో జక్కగ నిర్వహించియుండెను. ఈతడు శతకమును రచింపబూని తనకు సూర్యుని యందు గల భక్తి లోకమున వెల్లడించుటకై యొక యగాధమగు మూతిపై మధ్యగనొక దూలమును వైచి దాని కొక నూట యెనిమిది చేరులు గల యుట్టి నొక దానిని గట్టి దానిలో నొక తట్టను బెట్టి తానందు గూర్చుండె ననియు నొక్కొక్క పద్యము జెప్పుచు నొక్కొక్క యుట్టిచేరునుగోయుచునిట్లే యష్టోత్తరశతపద్యములు పూర్తియగునప్పటికి, అన్ని చేరులును దెగిపోయెననియు నాతట్టలో నాకవి నూతంగూలక నిలిచియుండెననిన్య్