ఈ పుట ఆమోదించబడ్డది

చెను. ఈతని మనుమరాలు బాలిద్వీప రాజప్రతినిధియగు ఉదయనుని బెండ్లాడెను. వీరికి ఎర్లస్‌గుడుదయించెను. బాల్యమునందితడు శత్రువులచే బాధింపబడి, కొంతకాల మరణ్యవాసమొనర్చెను. క్రీ. శ. 1035 నాటి కీతడు శత్రువులనెల్ల నిర్జించి జావాద్వీపమున కంతటికిని యేలిక యయ్యెను. ఈతని రాజ్యకాలము కడుప్రసిద్ధమైనది. ఎర్లస్‌గుని ప్రోత్సాహముచే అర్జున వివాహము, విరాటపర్వము మున్నగు గ్రంథములు పూర్వజావా భాషయగు కావీభాషలో లొఖింపబడినవి. అంతియగాక మహాభారతమును రామాయణమును గూడ దేశభాషలోనికి బరివర్తింపబడినవి. క్రీ. శ. 1042 లో నీరాజు తన రాజ్యమునంతటిని కెదిరి జంగల యను పేరిట రెండు భాగములుగ జేసి తన యిర్వురు తనయులకునొసంగి తాను విరాగియై వనములకేగెను.

కెదిరి రాజ్యము :- ఇంతటినుండియు కెదిరి రాజ్యచరిత్ర మారంభమగును. కానీవాఙ్మయాభివృద్ధి కీరాజ్యము మూలస్తంభము. క్రీ. శ. 1104 లో వర్షజయు డిచ్చట రాజుగనుండెను. ఈతని యాశ్రితుడగు త్రిగుణుడనుకవి సుమసనసంతక, కృష్ణజనన యను రెండు కావ్యములను కావీభాషలో రచించెను. క్రీ. శ. 1120 లో కామేశ్వరుడు కెదిరికి రాజయ్యెను. ఇతని భార్య జంగలరాజ పుత్రి. ఈ రాజు కొలువు దీర్చునపుడు స్వర్ణసింహాసనమున గూర్చొను చుండెనట. ధర్మజుడను నతడాస్థాన కవిగనుండి యీ కాలమున స్మరదహసమను కావ్యమును రచించెను.

1135-55 ల నడుమ జయభయుడు కెదిరి రాజ్యమును పాలించెను. ఈతని పోషణముననుండి పెనూలూ యను కవి భారత యుద్దమును, హరివంశమును రచించెను. జయభయుడు జావాద్వీప వాసులచే