ఈ పుట ఆమోదించబడ్డది

యుల వ్రాతలలో కాంభోజదేశమునకు మరియొక కౌండిన్యుడేతెంచి యప్పటి కట రాణిగనున్న సోమయను నామెను పెండ్లియై బ్రజలచే రాజుగ నెన్నుకొన బడెనని యున్నది. యీగాథలనుండి దక్షిణహిందూదేశమునకును కాంభోజరాజ్యోత్పత్తికిని సన్నిహితమగు సంబంధముగలదని తెలియుచున్నది. జదునాథ్ సర్కార్‌పండితు డీయూహకే మరి రెండుకారణముల నొసంగుచున్నాడు. (1) వర్మయను కాంభోజరాజుల నామాంత్యము (2) ఇచటి దేవాలయ శిఖరములు దక్షిణహిందూదేశపు గోపురములనుపోలియుండుట. వీనినిబట్టి కాంభోజదేశమునకు మొదట వలస వచ్చినవారు కళింగము ఉత్తరసర్కారులనుండి, ముఖ్యముగ కృష్ణాగోదావరీతీరములనుండి వచ్చియుండిరని పైపండితుని యభిప్రాయము.

యీ రాజ్యముయొక్క చరిత్రను ప్రారంభించుటకు Baksey Chang Krang అనుచోట గన్గొనబడిన సంస్కృతశాసన ముపకరించుచున్నది. ఆది కంబుస్వాయంభువ శృతవర్మన్ , శ్రేష్ఠవర్మన్, భావవర్మన్ అను మరి మూడు సమకాలిక పురుషాంతరములను తెల్పుచున్నది. ఇందు రెండవ వరుసలోని కౌండిన్యుడే క్రీ. శ. 4 వ శతాబ్దమున కాంభోజదేశమునకు వచ్చినవాడు, రుద్రవర్మ క్రీ. శ. 570 ప్రాంతమున నుండెను. విష్ణువుతోడను, దిలీపునితోడ నీతడు సరిపోల్పబడినాడు. యీ కాలమునకు హిందూ ఆయుర్వేద మీదేశమునకు వ్యాపించినది. రాజువద్ద అశ్వినులను పోలిన యిర్వురువైద్యులుండిరట. రుద్రవర్మతనయుడగు భావవర్మ క్రీ. శ. 580-600 నడుమ రాజయ్యెను. యీరాజు తమ్ముడు చిత్రసేనుడను నతడు పూనన్‌రాజు నోడించెను. ఇంతటితో కాంభోజము స్వతంత్రరాజ్యమయ్యెను. భావవర్మసోదరి సామవేదపారగుడగు సోమశర్మయను నతనిని పెండ్లాడెను. యీసోమశర్మ విష్ణుభక్తుడు. విష్ణ్వాలయములను, సూర్యాలయముల నెన్నిటినో గట్టించి యీతడు వానికి మహాభారత రామాయణ