ఈ పుట ఆమోదించబడ్డది

పడిరి. చైనాలో 'వెయ్‌' వంశీయులుపాలించుకాలమునం దీనగరమున భారతదేశబౌద్దమతము ప్రబలినది. చుట్టుపట్లనుండు కొండలలో గుహలను దొల్చి శిల్పులు వేయి బౌద్దాలయములను నిర్మించిరి. ఇటీవల బరిశోధకులు వీనిని దెఱచి యాశిల్పములను, కుచియను, కోటానీ, సిరియను, టిబెటను సంస్కృతభాషలలో లిఖింపబడిన గ్రంథములను, గన్గొనిరి. టుఎన్ హున్‌గ్ నగరమునుండి యొకదారి లాబ్‌నార్ సరస్సునకు దక్షిణమునగల షాన్‌షాన్‌కేగి యటనుండి టారిం నదీతీరముననుసరించి యార్‌ఖండ్‌కును, అటుపై పామిర్ పర్వతములను దాటి బాల్‌ఖ్, పార్దియామొదలగు టర్కీస్థానదేశములకు నేగుచుండెను. మఱియొకదారి టారింనదీతీరము ననుసరించి ఖోటానుకు పోయి, వామిర్ పర్వతములనుదాటి, సమర్‌కండ్ మీదుగాబశ్చిమమునకు బోవుచుండెను. క్రీ. శ. 4 వ శతాబ్దమున హిందూ దేశమునకు వచ్చిన ఫాహియాన్ అను చైనాదేశయాత్రికుడు టుఎన్‌హోన్‌గ్ నుండి టారింమార్గమున కరషస్, ఖోటాన్ కాష్‌ఘర్‌లమీదుగా వచ్చి పర్వతములను దాటి గిల్‌గిట్ నదీతీరము ననుసరించి సింధుప్రాంతమును జేరెను. 7 వ శతాబ్దమున హ్యూన్‌ష్వాంగ్ అనునతడుగూడ చైనాలోని టుఎన్‌హున్‌గ్ నుండి బయలుదేరి కరషర్, కుచమీదుగానేగి బెడల్‌కనుమగుండా ఇస్సికుల్ నదిని చేరెను. ఇంతకుపూర్వము నాలందానుండి ప్రభాకరమిత్రుడనుభిక్షువుయిటకు వచ్చి, కొంతకాలమునకు బిమ్మట చైనా కేగియుండెను. ఈ యాత్రికు డిటనుండి సోగ్డియాకేగి యటనుండి కప కుబోయి, హిందూకుష్ పర్వతమును దాటి హిందూదేశమును బ్రవేశించెను.

(2) అస్సాం మార్గము :- అస్సాం, ఉత్తరబర్మాలమీదుగా హిందూ దేశమునుండి దక్షిణచైనాకు మఱియొకమార్గముండెడిది. కాని యిందు దుర్గమములగు పర్వతములును' క్రూరజంతువులును, క్రూరతములగు నడవిజాతివారు నుండుటచే నీమార్గము బ్రసిద్దికెక్కి యుండలేదు. క్రీ. శ. 7 వ శతాబ్దిలో హ్యూన్‌ష్వాంగ్ కామరూపము (Assam) లో నుండుగా