పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/38

ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

33

భారత రమణి

కేదా-- వీరా తగు మనుష్యులు? పెద్ద వేషము వేసిన పెద్దమనుష్యు లగుదురా? వీరి నిప్పుడు గెంటివేయకున్న నీకును నాకును సఖ్యము నేటితో సరి.

దేవే--కేదారా!

కేదా-- మంచిది. ఇచట నె నుండను (పోవును)

దేవే--కేదారా! కేదారా!... అయ్యలారా!

నవీ--మేము వీని మాటలను పాటిసేయము, తాగిన వానితో తగునా?

హరి--దేవేంద్రా ! వాని మాటల కేమి, ఇటువిను, నే నామాటయే నీకో ప్రస్తావించ్ వలెనని అనుకొను చున్నాను.

దేవే-- ఏది ?

హరి-- కేదారు డన్నదే-ఒక కార్యమున రెండు లాభములు రానున్నవి. అప్పు తీరును, అమ్మాయి పెండ్లి అగును.

దేవే-- సరే- ఆలోచించి చెప్పెదను.

హరి--అట్లే కానిమ్ము. ఇట్టి సౌకర్య మీజన్మమున నీకు రాదు.

శంక-- మేము పోవుదము. నిశ్చితాభిప్రాయము నెప్పుడు తెల్పెదవు? దేవే--రేపు

హరి-- మంచిది- ఇక మాకు సెలవు.