ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మస్ఫురద్ధేమని
ర్మితగేహంబునఁ బద్మినీముఖసతుల్ సేవింప ధాత్రీసురా
ర్చితలీలాకృతి నొప్పు నిన్నుఁ దలఁతున్ శ్రీసూర్యనారాయణా! 4

శా. శ్రీమత్పద్మసముద్భవాదితనువుల్ చేకొంచు నెవ్వాఁడు నా
మాయల్ గనుపట్ట ముజ్జగములన్ గావించి రక్షాలయ
వ్యామోహంబున నొప్పునట్టి నిగమవ్యాలీఢపాదాబ్జు నిన్
బ్రేమన్ గన్గొని సంస్మరింతు మదిలో శ్రీసూర్యనారాయణా! 5

శా. ఛాయాదిప్రియకాంతలన్ మధురభాషాలీలచేఁ దన్పుచున్
గాయం బుజ్జ్వలమై పరిష్కృతపరిష్కారంబునై మించ లో
కాయాసంబు లణంచి దుర్మదబలవ్యాసంగిదైత్యోత్కరా
జేయస్ఫూర్తి నెసంగు నిన్నుఁ దలఁతున్ శ్రీసూర్యనారాయణా! 6

శా. వేదప్రోక్తనమస్కృతు ల్సలుపుచున్ బృథ్వీసురు ల్మెచ్చి నీ
పాదాబ్జస్మరణైకనిత్యభజనాపారీణులై నిల్వఁగా
ఖేదంబు ల్తొలఁగించి వారలకు నుత్కృష్టాపవర్గం బవి
చ్ఛేదాసక్తి నొసంగు నిన్నుఁ దలఁతున్ శ్రీసూర్యనారాయణా! 7

మ. అకలంకస్ఫటికంబు నూతనజపోద్యద్దీప్తి నాగంతుక
ప్రకటచ్ఛాయ ధరించినట్లు జలగోళం బౌటఁ జంద్రుండు నీ
సకలోస్రంబులు దాల్చి