ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

శ్వర్రావు మేనమామ, సీతారామయ్యగారు లోపలికివచ్చారు. కామేశ్వర్రావు నిర్ఘాంతపోయాడు. మేనమామ అతి కోప కంఠంతో "యేవిరా, కాముడూ ! చదువు కున్నందుకు యిదేనా యేంటి? కులం తగలేస్తున్నావు. కుటుంబం తగలేస్తున్నావు. మా అప్ప కుళ్లికుళ్లి మంచం పట్టింది. మేం పదిమందిలో తలయెత్తుకుని తిరగ లేకుండా వున్నాం. అప్పులు చేసేసి తమ్ముణ్ణీ నిన్నూకూడా తగలేసుకుంటున్నావ్. నీ కొచ్చిన సమ్మంధాల వాళ్ళకి జవాబులు చెప్పలేకుండా సచ్చిపోతున్నాం. అనంతపురం డిప్యూటీకలక్టరుగారు పిల్లనిస్తామని నాతోకూడావచ్చారు. ఆయన పెద్ద హోటలులో వున్నారు. రా, అక్కడికిపోదాం. నీ మూటాముల్లీ సద్దుకో. మనం భీంవారం వెళ్ళిపోదాం లెగు."

సీతా -- నాయనా! వీరయ్య తన గొడవ తను చూసుకుంటాడు. ఆతనిపై దయ వుంచి ఇహ ఒదిలెయ్య మంటున్నాడు. నీ ధర్మం నువ్వు ఆలోచించుకో.

వీర -- కామేశ్వర్రావుబాబుగారూ! మీరు మాకు చేసిన ఉపకారానికి మేం యెన్ని జన్మలెత్తి మీకు సేవజేసినా కృతజ్ఞత తీర్చుకోలేమండి, మా తమ్ముడి కూతురు కొడుక్కి సామీ మా అమ్మణ్ణిని యివ్వడానికి సమ్మందం యేర్పాటు చేసినా. మేం అంతా ఒరంగలెడుతుండము.

కామేశ్వర్రావు తుపాకుల యెదుట సింహంలా చుట్టూ తేరిపార చూశాడు. మాట జవాబు చెప్పకుండా అతి కోప

96