బొమ్మలరాణి
ఆ మరునాడు కామేశ్వర్రావు కొందరు స్నేహితుల సహాయంతో కజిన్సుగారిని కలుసుకున్నాడు.
కామే -- జావా తోలుబొమ్మలాట చూచానండి. ఆ ఆట ఆంధ్రదేశం నించే వెళ్లిందని నా ఊహ.
కజిన్సు -- కావచ్చును. ఈ రెండుదేశాల ప్రదర్శనాలకు చాలా సంబంధం వున్నమాట నిజమే.
కామే -- ఈ ఆటలో నాటకం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనము, కవిత్వము, భాష మొదలైన కళలన్నీ దివ్యంగా కలిసి వున్నాయండి.
కజిన్సు -- జావా ఆటలో కొన్ని దోషాలు వచ్చాయి. ఆంధ్రదేశంలోని ఆటను కొన్ని దోషాలు ఆవరించినాయి. కళ రానురాను హీనస్థితికి వచ్చింది.
కామే -- మానవునిలో వున్న పశుత్వం (Atavism) ప్రతి వ్యక్తిజీవితం లోను ఒకసారి పైకివచ్చినట్లుగానే ఒక సంఘజీవితంలోకూడా అప్పుడప్పుడు వస్తుంది గాదండి.
కజిన్సు -- నువ్వు సరిగా చెప్పావయ్యా! ప్రేక్షకలోకం యొక్క హృదయస్థితిని బట్టి ప్రదర్శనం రీతిన్నీ మారుతూ వుంటుంది. సంఘకళారసజ్ఞత అధోలోకంలోకి పడిపోతూ వున్నప్పుడు ఆ పతనాన్ని ఆపుచేసి నిలబెట్టే బాధ్యత ప్రభుత్వంపైనా, కళాస్రష్టలపైనా, జమీందారులపైనా, ధనికిలపైనా వున్నది.
కామే -- అవునండి. ఈ తోలుబొమ్మల్లోని ఉత్కృష్టత మరిచిపోయి, ఉత్తములు విముఖులవడంచేత పాటక
89