ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

పుట్టిన ఈ పెళ్ళిళ్లు సత్యబద్ధమైనవా? భగవంతునికి యిష్టమైనవా? లేకపోతే వివాహంలేని ప్రణయం పాపభూయిష్టమైన దనే మాట నిజమా? ఇంతవరకూ తాను ప్రేమ అనే దేమిటో యెరుగడు. ఏదో అలంకరించుకొని, పొంకాలు తిరిగివున్న దేహంతో వున్న యువతు లాతని హృదయం చెదరగొట్టే వారు. తనకు మోహావేశము కల్గిన మాట నిజమే. అంత మాత్రమే. నిజమైన ప్రేమక్కూడా మోహావేశం వున్నది. ప్రణయంకూడా శారీర ప్రేమరహితమై అదోరకపు విచిత్రమైన ఉత్కృష్ట ఆశయభావమన్నా తాను నమ్మడు. భగవంతుని మీద ప్రేమా, దేశంమీద ప్రేమ కూడా దేహసంబంధం కోరుతున్నాయే!

ఈ విచిత్ర సంఘటన గుంటూరులో పురవిశ్రాంతి భవనంలో జరిగింది. సీతారామయ్యగారికీ, వీరయ్యకూ, కామేశ్వర్రావు హృదయం కీనీడగా, చూచాయగా గోచరించింది. వాళ్లిద్దరూ భయపడిపోయారు. అప్పటినుంచీ ఒకరి నొకరు సంప్రదించుకోకపోయినా కామేశ్వర్రావూ మీనాక్షి, ఏకాంతంగా వుండకుండా వాళ్లు చూస్తూ వుండేవాళ్లు. వీరయ్యకు తాను చెయ్యవలసినదేమిటో తోచలేదు.

పులిమీద పుట్ర అన్నట్లు కొందరు ధనవంతులు, ఒకరిద్దరు జమిందారులు వ్యంగ్యపు మాటలతో మీనాక్షిని తమతో ఒకటిరెండు రాత్రిళ్ళుగానీ ఇంకా యెక్కువగా గాని గడిపేటట్లు చేస్తే పదివేల దాకా కూడ బహుమతు లిస్తా మని

86