ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

చేసి బందరు వెళ్ళారని తెలుసుకొని సాయంత్రానికి బందరు చేరుకున్నాడు. వీరయ్యజట్టువాళ్లు ఇనుకుదుర్లో తమ పూరి గుడిసెలు వేసుకున్నారు. కామేశ్వర్రావు తిరిగి తిరిగి అక్కడకు చేరుకున్నాడు. తన ఆత్మలో, ఆత్మయగు మీనాక్షి ఆ పూరిగుడిశెల్లో వుందనే భావం ఆతన్ని దహించి వేసింది. ఇదివరదాకా తోలుబొమ్మలవాళ్లు అల్లాంటి పూరిగుడిశెల్లో వుండడం అతనికేమీ ఆశ్చర్యం కలుగ జేయలేదు. అక్కడికి వెళ్ళి "వీరయ్యా" అని కేకవేసినాడు. వీరయ్య యివతలికి వచ్చి కామేశ్వర్రావుగారినిచూసి "బాబూ ! ఇల్లాగ వచ్చా రేమిటి?" అని ప్రశ్నించాడు, కామేశ్వర్రావు ప్రక్కనేవున్న కాలవకు కట్టిన తూము అరుగుమీద కూర్చొని వీరయ్యని ప్రక్కనే కూర్చోమన్నాడు.

వీరయ్య కామేశ్వర్రావుతో "బాబూ, నా నోటిదగ్గిర కూడు క్రిందికి బోర్లాపడింది సామీ" అని బెజవాడలో జరిగినదంతా వెళ్ళబోసుకొన్నాడు. "సీతారామయ్య బాబుగారు మా పిల్లను పాడుచేశారు సామీ, పాట పాడలేదు, గొంతు యెత్తలేదు, ఆట కెందుకూ పనికిరాకుండాపోయింది." అతడు నుదుటిమీద కొట్టుకున్నాడు.

కామేశ్వర్రావు అంతా నిమిషంలో గ్రహించాడు. అతనికి ఒక చక్కని ఆలోచన మృదువుగా తట్టింది. లేచి నుంచొని వీరయ్య బుజం మీద చెయివేసి "వీరయ్యా, నువ్వేమీ కంగారుపడకు, గురువుగారు చేసిన దెప్పుడూ తప్పు కాదు. అందులో మా గురువుగారు పరమ పవిత్రుడు. నువ్వు

79