'బాపిరాజు'
తనదగ్గిర అవసరం లేకుండా చేసుకున్నాడు. ఏడున్నర దగ్గిర నుంచి రాత్రి యనిమిదిన్నర వరకు మీనాక్షికి పాఠం జెప్పేవారు సీతారామయ్యగారు. మీనాక్షిపాఠం అయిన తరువాతనే కామేశ్వర్రావు ఇంటికి వెడుతూఉండేవాడు. ఇంటిదగ్గిర సాధన చేయడం వల్ల కామేశ్వర్రావుకు సంగీతశాస్త్ర సిద్ధాంతాలన్నీ ఇట్టే కరతలామలకమైపోయాయి. జంటలు, గీతాలు, స్వరజితులు, వర్ణాలు ఆరునెలల్లో పూర్తిజేసి కీర్తనలకు వచ్చాడు. మీనాక్షి తనతాతగారు నేర్పినదంతా మర్చిపోయి మళ్లీ నేర్చుకోవలసివచ్చింది. అద్భుతమైన గొంతుక కాబట్టి మూడునెలలలో రాగాలు, కీర్తనలుకూడా ప్రారంభిచింది.
మీనాక్షి వికసిస్తూ ఉన్న పుష్పము. ఆమె ఇంకా అందాలు కోసుకొని దండలు గుచ్చుకుంటోంది. ఆమె హృదయము లేడిపిల్ల లాంటిది. చిన్నతనాన్నుంచి ఆమె కంఠంలోని గానాద్భుతంచూచి మురిసిపోయే తాతగారు ఆమెకు చక్కని సంబంధం వెతికి మనమణ్ణితెచ్చుకొని ఇల్లరికం ఉంచుకోవాలని ఉవ్విళ్లూరుతో ఉండేవాడు.
మీనాక్షికి కామేశ్వర్రావు ఎందుకంత తనతో చనవుచేసుకుంటున్నాడో అనే ఆలోచనైనా కలగలేదు. కామేశ్వర్రావును చూస్తే ఆమెకు చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడూ అతనితో ప్రాణమిచ్చి మాట్లాడేది. జట్టుతోపాటు ఆమె యెన్ని ఊర్లు తిరిగినా ప్రపంచజ్ఞానములోని ఓనమాలన్నా ఎరగదు. అంచేత కామేశ్వర్రావు
68