బొమ్మలరాణి
పిల్లకి గర్వం హెచ్చైపోయి తరతరాలనించీ వస్తూవున్న ఈ పవిత్రమైన వృత్తిని భీమవరం ముఱికికాలువలోనో, నర్సాపురం గోదావరిలోనో కలిపేస్తే !
"స్వామీ, తమరు శలవిచ్చింది ఎంతో సంతోషమైంది - కాని ఏమిచేసేది? వృత్తివాండ్లం. జట్టు కొద్దిమందే ఉంటిమి. ఈ కరువుదినాలలో మా రాబడి అంతా ఈ పిల్లదాని గొంతుకపైనే ఆధార పడిఉంది. స్వామీ?"
"ఓయి వెఱ్ఱివాడా, ఇప్పుడు కొంచెం కాలం మళ్ళు తోందోయ్. తోలుబొమ్మలు, వీథినాటకాలు మళ్ళీ దేశంలో ఉద్దరింపబడతాయి. నాగరికత కలవాళ్ళే వీట్లను ఉద్ధరిస్తారు. అల్లాంటప్పుడు నీ మనమరాలు సంగీతం నేర్చుకుని ఉందంటే నీ జట్టుకు వచ్చేగౌరవం ఇంతాఅంతా అని కాదు."
వీరయ్య -- అదేమిటి స్వామీ, వీథినాటకాలు మూలబడ్డాయి. కూచిపూడిభాగవతులు కూలిపోయారు. విప్రవినోదులు అయిపులేరు. సినీమాలు, నాటకాలు మఱి అదేంటి స్వామీ, ఏమిట్రా అబ్బాయి దానిపేరు, విప్రవినోదులు చేసే పనులు చేస్తారు?
సీతా -- ఓ ! మాజిక్కా !
వీర -- అదో అదండి. అల్లాంటివన్నీ పెరిగి పొయ్యాయి.
61