బొమ్మలరాణి
కొంచెం ప్రొద్దుపోయినా పదిగంటలకు ఊళ్ళోవర్తకులు, కరణాలు, పండితులు, ఓవరిసీయరు, స్కూళ్ళయినస్పెక్టరు, రెవిన్యూ యినస్పెక్టరు మొదలగు ఉద్యోగులు, ఏమీ చేయకుండా ఊళ్లో కూచొనియున్న కామేశ్వరరావు యం. ఏ. గారూ, యావన్మందీ వచ్చి వాళ్లకు వీలుగా ఏర్పరచిన పెద్దకాపుగారి పెద్దరుగుల మీద కూర్చున్నారు. చాపలమీద దిండ్లూ, పరుపులూ, తీవాసీలూ అన్నీ వేయించాడు, కామేశ్వరరావు యం. ఏ., పెద్దకాపు దగ్గిరచుట్టం.
హనుమంతుడికి రాములవారు సుగ్రీవుణ్ణి తీసుకురావలసినదిగా ఆజ్ఞాపిస్తున్నారు. రాములవారు కుడి చేతిని మాత్రం కదుపుతున్నారు : 'అయితే, ఓయి మిత్రుడా, హనుమంతుడా'
"అవును స్వామీ ఉహుఁ."
"కపి, ప్లవంగ, ప్లపగ, శాఖామృగ, వళీముఖాః,
మర్కటో, వానరః కీశో వనౌకాః, ఇత్యమరః.
అట్టి మర్కటశ్రేష్ఠుడై, ఉత్తముడైన సుగ్రీవుడు"
"చిత్తం రాఘవేంద్రా, శ్రీరామచంద్రా"
"హనుమంతా ఎందుకు నాకు ఆ సుగ్రీవుడు కనబడుతున్న వాడవుకుంటూ ఉండలేదేమోయి?"
"ఓహో రామచంద్రా దశరథపుత్రా, నేను తప్పకుండా సుగ్రీవమహారాజు ఏమిచేస్తున్నాడో చూసివస్తున్నాను రాఘవేంద్రా"
57