ఈ పుట ఆమోదించబడ్డది

నరసన్న పాపాయి

పిల్లలు కలుగుతారంటారు. భరతాంబ నా దగ్గిరే. నన్ను "అత్తా!" అంటుంది. నా దగ్గిర పండుకొనే నిద్రపోతే ఓ రాత్రివేళ వాళ్ళమ్మ వచ్చి తీసుకుపోయేది.

ఓ రోజున ఆ పెంకి భరతం అల్లరి చేసింది నా దగ్గిర పడుకుని నిద్రపోయి రవిక పిన్ను ఊడిపోయి నా బంగారు నిధులు, పొడిబంగారు కలశాలు, కర్కశపు ఉబుకులు, చిన్న బిడ్డ పుణుకులు ఎరగని, పనికిరాని వట్టి అందాలు, భరతాంబ నోటితో అందిపుచ్చుకుని, పట్టి మొనలు పునకడం ప్రారంభించింది. నాకూ నిద్రపట్టింది కాబోలు ! వళ్ళు ఝల్లుమని మేనెల్లా తీపులు ప్రవహించి ఆనందం ముంచెత్తి ఎవరో బంగారు పాపాయి నా గర్భం పండించి నాపాలు పుణుకుతున్నట్లయి మెలకువవచ్చింది. భరతం కొంటిపాప నిద్రలో పుణుకుమని వట్టి వట్టిపాలు తాగుతున్నది.

ఆసి అల్లరిదానా అని సిగ్గుపడి మా ఆయన నిద్రపోతూ ఉండటం చూచి, నెమ్మదించుకొని, దిబ్బెసలాంటి భరతాంబ పిరుదులపై రెండు చిన్నదెబ్బలు తగిలించి వాళ్ల అమ్మని పిలిచి భరతాన్ని అందిచ్చాను.

అక్కడనుంచి రోజూ కలలు! రెండు నెలలకు నాకు నెల తప్పింది. నా కన్న ! నా భరతం నాకు వరమిచ్చింది.

ఇంక మారత్తాలు - రత్నం - సంతోషం ఇంతా అంతా! మా ఆయన నన్ను పూజించారంటే, వారు పదహారుకళల చంద్రు లయ్యారు.

51