ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

మా నరసన్న, నరసన్నగారు. సభ్యుడు. ఇప్పుడూ మా అన్నయ్య నరసన్నను కొడతాడా రుద్రేశ్వరం గుడి ఎదుట ! ఏమో ! మా అన్నయ్య ఎంతకైనా తగును !

నరసన్నకు మా దంపుళ్ళసావిడి అయిదువందల రూపాయలుపెట్టి చక్కని ఇల్లులా సిద్ధంచేసి మా వారు అందులో ప్రవేశించ బెట్టారు. ఇంక మా స్థితి? నాకు నరసన్నపాపాయి ఆప్తురాలు.

నేనూ, నరసన్న భార్య రత్తాలూ - రత్నమ్మా, ఖద్దరు వడకడం ప్రారంభించాము. మా వారు ఎప్పటి నుంచో ఖద్దరు కడుతున్నారు. ఇప్పుడు నరసయ్య అన్నా, రత్నం మరదలూ, మేనకోడలు భరతాంబా అందరూ ఖద్దరు కడుతున్నాం.

నరసయ్య అన్నా, అతని కుటుంబమూ శుభ్రంగా తిండి తింటున్నారు. శుభ్రంగా బట్టలు కట్టుకుంటున్నారు. రుద్రేశ్వర దేవాలయం ఎదుట మా అన్నయ్య కొట్టిన దెబ్బలూ, ఆతని ఏడుపూ నరసన్నకు ఆశీర్వచనాలు !

భరతదేశం లోని హరిజను లందరూ రుద్రేశ్వర దేవాలయం ఎదుట మా అన్నయ్యచేత దెబ్బలు తినాలా?

భరతదేశం లోని హరిజను లందరూ ఇంత తిండీ, ఇంత బట్టా సంపాదించుకోవాలంటే శాసన సభ్యులవ్వాలా ?

ఇంతకూ మా నరసయ్యన్న పాపాయిని నేనే పెంచడం. పిల్లలులేని వాళ్లు ఇంకోళ్ళ పాపని తెచ్చుకు పెంచుకుంటే

50