ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

దూరాన్నుంచి ఘంటానాదాలు, భిఖ్కుల మంత్రస్వనాలు తుమ్మెదల ఝంకారాలతో, పక్షుల కలకూజితాలతో కలిసి వినవస్తూన్నవి.

విహారానికి వచ్చిన మృగినై ఆ లోయ చొచ్చుకు పోతిని. మా వాండ్లు వెనకనే నెమ్మదిగా వస్తూ ఉండిరి. “అమ్మాయీ! ఒంటరిగా ముందు వెళ్ళి పోకమ్మా!” అని మా అమ్మ అన్నమాట ఎక్కడో దూరాన్ని వినబడింది. ఒక మలుపు మళ్లింది. ఎట్టయెదుట దివ్యదర్శనం.

భోగీర ఉత్తరవాహిని అయిన అర్ధచంద్రాకారంలో నదికి ఇరవైధనువులయెత్తున రూపెత్తిన మంత్రప్రదర్శనంలా గుహలు, చైత్యాలు, విహారాలు ఒక శిల్పమాలిక, దూరాన్నుంచి కళ్లల్లో ఇంద్రధనువులాడుతూన్నవి. స్తంభాల శిల్పవిన్నాణము, చిత్రకౌశలం, విగ్రహాల సుసౌష్ఠవమూర్తిత్వము, ఆహారే! భిఖ్కుల కౌశేయ కాశ్మీర కుసుమవర్ణ వికాసము, విద్యార్థుల ధవళవర్ణ ధౌతవిలాసము, నాగరుల జానపదుల వివిధవర్ణ వినీత విచిత్రత్వము - ఒక్క పెద్దచిత్రంలా ప్రత్యక్షమైంది.

కళ్లు మూసుకొని తధాగతుని ధ్యానించుకొన్నాను. భోగీరాశ్రమ మహాపరిషత్తు సంఘారామానికి హృదయంలో చేయెత్తి జోహారు లర్పించుకొన్నాను.

నీళ్ళకు నదిలోకి దిగేవాళ్లు, రంగురంగుల కలశాలను భుజాలమీద అలంకరించుకొని మెట్లేక్కేవాళ్లు, యోషలు, పురుషులు, బాలికలు, భిఖ్కులు; ఒకసారి భావాలు హృద

6