ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

'అవునండి ఖామందుగారూ!' అన్న అతని మొగం పూవులా వికసించింది.

నరసన్న ఒడ్డూ పొడుగూ అయ్యాడు. నరసన్న నల్లని రాయిచెక్కిన విగ్రహంలా మూర్తితాల్చాడు.

నరసన్నకు చదువులేదు. కాని వాడు చెప్పిన సలహా తిమ్మరుసు సలహా!

నరసన్న మా పాలేరు అవడానికి నేనే కారకురాలిని. అతడు మా పాలే రయినందుకు మాకు కోటివిధాల లాభమే అయింది. ఆ వూళ్ళో (మా వూరు 'పాడు') మా పొలం లా పండే భూమేది?

నరసన్న రుద్రేశ్వరం శివరాత్రి వుత్సవంలో గుడిలోకి వెళ్ళబోతోవుంటే మా అన్నయ్య అతన్ని చావ గొట్టాడు!

మాలలూ మాదిగలూ యెన్నిసారులు పెద్దకులాల వారిచే దెబ్బలు తినలేదు !

మాలలూ మాదిగలూ యెంతమంది క్రిష్టియన్ మతంలో చేరలేదు !

మాలలూ మాదిగలూ మాకు దూరంగా వుండాలి ! మేము అంటు అవుతాము. నరసన్న భార్యను యెవరూ చూడకుండా నా దగ్గరకు రమ్మనేదాన్ని, నా తల దువ్వమనే దాన్ని, రత్తాలు మొదట నవ్వేసింది. తర్వాత నా బ్రతిమాలడాలు, నా కోపడపడాలవల్లా భయపడుతూ ఒప్పుకొని

44