ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

“నీ నియమాలని భగవంతుని కర్పించి మానవ శీల మందు విశ్వాసంతో చిత్రకళాదీక్ష నెరపవయ్యా” అని నాకు పరమగురుని ఆదేశం వినబడి న ట్లయింది.

5

నన్ను చూస్తూనే మా గురుదేవులు, తాను తా గానట్లు “నువ్వు దేవబాలికవా?” అని ప్రశ్నించినప్పుడు యేదో నిర్వచింపజాలని ఆనందంతో వొణికిపొయ్యాను. సామాన్యమైన మూర్తైనా అనన్యమైన యేదో వెలుగుతో మహాసౌందర్య మూర్తిలా తోస్తారు. ఉత్తమ శిల్పమూర్తి లక్షణాలు ఆయనలో కొరతపడినా కొరత పడినట్లే వుండవు. ఆ రావడం వచ్చి నా బుజాలు చేతులతో అదిమిపట్టి ఇటు అటు వూపి, ‘ఏల ఈ తప్పిదం చేశా’వని నన్ను శిక్షిస్తే, నా జన్మ పవిత్రమైందని వూహించుకొనేదాన్ని. ఆ క్షణంలో ఆయన దివ్యుడే అయిపోయినాడు. ఆయన వేపు న న్నేదో విచిత్ర శక్తి ఆకర్షణ చేసింది. ఇంతలో ఆయన మటు మాయమై పోయినాడు. నా తప్పిదానికి నివృత్తి వున్నదా? ఈ సత్పురుషుని తపస్సు భంగం చేయటాని కుద్భవించిన పాపినా నేను? పవిత్రమైన ఆయన నియమానికి భంగం చేశాను తత్ఫలితంగా, ఏ నియమాలూ లేకుండా చిత్రవిద్య నేర్చుకోనటాని కందరూ రావచ్చునని ఆయన ప్రకటన చేశారు.

24