భోగీరలోయ
చిరునవ్వులతో నిండియున్న దేమి? అది నా కర్మ మనుకొని నేను వూరడిలాలి గాక!”
“ఓయీ! సౌందర్యతత్త్వోపాసీ! నీ చిత్రలేఖన విద్యలో ఒక్క చిన్న దోషమున్నదని నీవు గ్రహించలేదు. కరుణ నీ విగ్రహాలల్లో మూర్తించలేదు. సంప్రదాయ జనితాలై, మూర్తిలో-రూపకల్పనలో ఏ మాత్రమూ లోటు లేని చిత్రాలను యెన్ని కల్పించినా, వాటిలో కరుణ తొణికిసలాడటం లేదు. తండ్రీ! కరుణ నశించిపోయిన మరుభూమి యైన నీ ప్రజ్ఞ “ఏకోరసః కరుణఏవ” అనే మాట మరచి పోయింది. నీ బోధిసత్త్వుల చూపుల్లో కర్కశత్వం వున్నది. యోగం వున్నది. బుద్ధుడు పరమకరుణామూర్తి తండ్రీ! అహింసాపూర్ణావతారము. చేతిముద్రలలో, భంగిమాలలో, వివిధస్వరూపములైన దృష్టులలో సంపూర్ణ సత్యమైన దివ్యత్వం లేదు. ప్రాపంచికరూపమైన దివ్యత్వమే కరుణ. ఈ ముక్కలు నే నన్నానని విషాదపడకు. కొరతవడిన నీ పూజ పరిపూర్తి చెందవద్దా!”
మరిన్నీ కలవరంలోపడి మా విహారం యెలాగో చేరుకొని అక్కడ దివ్యభిక్షుని విగ్రహం మ్రోల నా తల వాల్చి కాంతికై యాచించాను. ఘటికలు జరిగిపోయినవి. వరములా నా మార్గము నాకు ప్రత్యక్షమైంది. “నా బొమ్మలలో కర్కశత్వ మున్నదా, ప్రభూ? ఇన్ని సంవత్సరాలూ నా తపస్సులో చంద్రగ్రహణంలా అసంపూర్ణత్వం వరించుకొనే వుందా?”
23