భోగీరలోయ
పూర్తి చేసికో. భయపిశాచము నీ హృదయాన్ని ముక్కలు చేయకుండా చూచుకో!”
మేము ఒక్క విఘటికాకాలము నిశ్చలులమై, వేణు వనము అను పేరుగల ఆ మహాచైత్యంలో సంధ్యాకాలము దోరరంగుల పాకించేవరకు ధాన్యకటకపు పాలరాతి బుద్ధదేవుని విగ్రహాలల్లా కూర్చుండిపోయాము. నా హృదయంలో జడత్వ మావరించింది. దూరాలపుట్టి యోజనశతాలు ప్రవహించి, ప్రవహించి, వొడ్డుకుచేరి విరిగిపోయే కెరటంలా నా ఆలోచనలు వికలాలు అయిపోయినవి.
3
జ్యోత్స్నాప్రియ నాములైన మా చిత్రాచార్యులు విసవిస వెళ్ళిపోవడం తోనే అక్కడ ఆగలేక పరుగిడిపోయినాను. నా హృదయం పచ్చి మృణ్మయపాత్రలా ఛిన్నమై పోయినది. దాసీజనము ఆశ్చర్య పడుతూ వుండగా, తల్లి వెల వెలపోతూ వుండగా, విస విస నడిచి ‘మాళవ మహారాజ విహార’గుహలోనికి పరువిడిపోయి మంచముపై నాథునిచే నిరసింపబడిన ఉమాదేవి చేతిలోని పూలదండలా ఒళ్లుతప్పి పడిపోయాను.
నాకు మెలుకువ వచ్చేటప్పటికి విహారమంతా చీకటిలో వున్నది. ఎక్కడో రెండు నేతి దీపాలు మినుకు మినుకుమంటూ మిణుగురులులా వున్నవి. ఆ చీకట్లోంచి గుహ
15