ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

దుర్భర విషాదము హాలహలమై సమస్త భువనాలూ దహించటానికి బయలుదేరినట్లయింది. దేశాలు తిరిగి తిరిగి ఈ ఆశ్రమానికి చేరుకొన్నాడు.”

“ఓయి వెఱ్ఱిబాలుడా! ఇంత విషాద గాధా నీది? అందుకనా స్త్రీలోకం మీద నీ కింత కోపము?”

“కోపము కాదు, భయము స్వామీ! తమ పాద సన్నిధి చేరుకుని కొంత వూరట పొంది జగద్గురువైన పరమ శ్రమణకుని అవతార మూర్తులైన మీకు నా సేవ అర్పించి భౌతిక వాసనల నుండి దూరమై నిర్వాణానికి అర్హత సంపాదించుకోటానికి దీక్ష వహించాను. నేను పూనిన ప్రతిజ్ఞలు తమకు నివేదించి శిల్పకళాదీక్షకు పూనాను. ఈ విషాద చరిత్రుణ్ణి ఒక బాలికకు గురువుకమ్మని ఆజ్ఞాపించటం నా మోక్షానికి నన్ను దూరం చేయటం అని మనవి చేసుకొంటూన్నాను.”

“బాపూ! బుద్ధదేవుని పరమ కరుణచేత అనన్యమైన మానవసేవ నాకు లభించింది. లోకాన్ని సంతరించటానికి పూనుకొన్న నాకు మానవహృదయం పూర్తిగా తెలుసును. శిల్పివైన నీ చిత్తవృత్తిలో ప్రేమ నశింపక లోతుల అణగి వున్నది నిర్వాణ పథార్థివై యున్న నీవు స్త్రీ విషయమై భయము సంపూర్ణంగా నాశనము చేసికో వలసి వుంటుంది. స్త్రీ మాయాదేవి యొక్క అంశ; ప్రజ్ఞాపరిమిత, శ్వేతతారాదేవి. ఈ బాలికకు నీవు చిత్రలేఖన విద్య నేర్పి నీ తపస్సు

14