'బాపిరాజు'
భించింది ఆ సెమ్మా. అప్పటినుంచీ మా వాళ్ళంతా యే చదువు చదివినా అందులో సంపూర్ణ పాండిత్యం. ఏది పట్టినా బంగారం. మమ్మల్ని జమీందారులనే అంటారుగా!
ఆ సెమ్మా గృహం శుచి చేసి, ఇంటి ఆవిడ పూజల అరుగు అలికి, ముగ్గులు పెట్టి-దీపం పెట్టగానే ఆ లక్ష్మీ సరస్వతీదేవి పక్కున నవ్వేదట. ఆ దీపంలో నెయ్యి అయిపోయే ముందు యెవరికో ఒకరికి తప్పక జ్ఞాపకం వచ్చే తీరేదట. రాత్రల్లా యెవరికో ఒకరికి మెలకువ వస్తోనే వుండేది. తెల్లవారగానే గాలివేసినట్లు ఆరిపోయేది. అందాకా గాలివాన వీస్తున్నా కదిలేది కాదని చెప్తారు.
3
ఆ సెమ్మా పోయింది యిప్పుడు. అప్పణ్ణుంచి మా యింట్లో అన్నీ దురదృష్టాలే. ఎల్లా పోయిందో?
మా తండ్రిగారు ఇంగ్లీషు పరీక్షల్లో బాగా పేసవు కుంటూ వచ్చారు. ఆయన జిల్లాజడ్జీపని చేస్తున్నారు ఇప్పుడు. ఆయన ఉద్యోగంలో ప్రవేసించిన కొన్నాళ్ళకే మా తాతగారు కాలథర్మం చేశారు. కోర్టుమునసబీ పని చేసినన్నాళ్లూ మా తండ్రిగారు యెవరో ఒక బ్రాహ్మణ్ణి దేవతార్చనం కోసం వుంచారు. సబుజడ్జీ అయింది. అప్పట్నుంచి ఆ పని పోయింది. ఒక జమీందారుగారి కుమార్తెనని మా అమ్మ దీపం పెట్టడం మానేసింది.
122