ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'బాపిరాజు'


"గోపురం అంటే - గుళ్ళో మనుషుల నెత్తిమీద పూజారి పెట్టడూ, అదా?"

"కాదురా నాన్నా! మనవూరి గుడికి ముందరగా ఇంకో గుళ్ళాగ ఎత్తుగా లేదూ; అది."

"అవును ఎన్నో బొమ్మలు చెక్కి వున్నాయి. మెట్లు మొన్నసాయంత్రం అప్పు డెప్పుడో చిట్టచివరదాకా నే నెక్కుతే - మీరంతా కంగారు బడ్డారు. అమ్మ ఏడ్చింది..."

"ఆరి నీ - గేపకం వుందీ ! విను అక్కడ ఒక ముసలమ్మ ఒక చిన్న పిల్లతో అడిలిపోతూవున్న చూపులతో యిటూఅటూ చూస్తూవుంది."

"ఆ చిన్నపిల్ల అందంగా వుందట. ఆవిడ మా తాతయ్య తాతయ్య తాతయ్యని చూచి ఒణుకుతూ తెలుగుతో "నాయనా మీ దేవూరు - మీరు తెలుగు వాళ్ళా" అని కంట నీరు పెట్టుకుంటూ వణుకుతూ అడిగిందట."

"అన్ని చోట్లా తెలుగేగా!"

"కుంభకోణంలో అరవం మాట్లాడుతారులే. అందుకని వాళ్ళు అరవవాళ్ళు".

"ఆ ముసలమ్మ తెలుగావి డన్నమాటా తాతయ్యా! ఆ తరవాత చెప్పవూ?"

"మా తాతయ్య తాతయ్య తాతయ్య 'అవునమ్మా మాది గోదావరీతీరం' అని కులగోత్రాలన్నీ చెప్పాట్ట. ఆ ముసలావిడ ఘోలుఘోలున దుఃఖిస్తూ 'నాయనా ! నా

118