ఈ పుట ఆమోదించబడ్డది

భోగీరలోయ

ఆజ్ఞ కై గురువుల కడ మోకరిల్లి నాను.

2

ఎవరో బాలిక నా యెదుట మోకరించింది. ఆ మూర్తి వస్తూఉన్నదని గ్రహించడం తోనే కన్నులు చటుక్కున మూసుకున్నాను.

“ఎవ రీ మె?”

ఆమెతోకూడా వచ్చిన ఒక వృద్ధ -

“స్వామీ, ఈ బాలిక మాళవప్రభుని మేనమరదుల వారున్ను, మాళవదేశానికి ముఖ్యమంత్రులున్ను అయిన ఆనందవసువులవారి ఏకతనయ. చిన్నతనాన్నుంచీ చిత్ర లేఖనములో మంచి చాతుర్య మలవరచుకొన్నది. ఐనా ఆమె శక్తికి తగిన గురువులు లభించకపోవటంచేత విద్య వృద్ధిపొందినది కాదు. జినదేవుని ధర్మప్రచారం లా, తమ కీర్తిన్నీ లోకాల్ని ఆవరిస్తూ వుండటం చేత తమ పాదసన్నిధిని శుశ్రూషచేయటానికని మా అమ్మాయిగారు వచ్చారు. చిత్ర విద్య ద్వారా నిర్వాణ మార్గాన్న న్వేషించటానికి మా అమ్మాయిగారికి దీక్ష యివ్వవలసినదని ఆనందవసువుల వారున్నా, మేమున్నూ ప్రార్థిస్తున్నాము.”

“ఎవరయ్యా, అక్కడ? ఈ పిశాచాలని నాదగ్గర కెవరయ్యా వదిలిపెట్టింది? గురుద్రోహం తలపెట్టిన పాపాత్ము

9