పుట:Bhaarata arthashaastramu (1958).pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

పశ్చాత్తాపమును రెండును దన్నెచెంద పరిపరివిధముల బ్రలాపించుట జూచివున్నాముగదా! అనురాగము ప్రగాఢమాయెననుట కిదియేసాక్షి.

ఆద్యనురాగము తీక్ష్ణతమము. ప్రాప్తిదట్టముగ నయినచో జల్లార జల్లార నింక విసుగుగా మాఱునేమో యనుస్థితి సమకూరును. అది అంత్యానురాగము. శమమునకు సమానము. వస్తువుయొక్క పరిమాణము ననుసరించి వాంఛయొక్క తీవ్రతయుండును. వస్తురాశితోన హీనవృద్ధి న్యాయానుగతమై యతిశయిల్లుచు నారాశియందుండు ప్రీతి సమష్ట్యనురాగము. ఈ సమష్ట్యనురాగము తలపుకొలది లభియించు గాలి మొదలగు వస్తువులయందంతట నుండునదియైనను ప్రాతభార్యయందలి కూరిమి యట్లు సాధారణముగ స్ఫురణమునకు రాదు. ఎప్పుడు వచ్చుననగా నావస్తువు అరుదైన. వస్తువు లేనియప్పుడెంతమనము తపింతుమో యా తాపమే యా వస్తువుయొక్క ఆద్యుపయుక్తతా పరిమాణము.

వాంఛలెట్లో యట్లే ప్రయోజనమును నని గ్రహించునది. ఇదియు నాద్యంత్యపూర్ణంబులని ముత్తెఱంగు.

హీనవృద్ధి న్యాయంబు వాంఛలయందు నుపగతంబ యనుటకు నమోఘ ప్రమాణంబొండుగలదు. అయ్యది మానస శాస్త్రమునకుం జేరినదైనను ఈ తత్త్వంబునకునెల్ల దీపమువంటిదగుట మీముందఱ నివేదింపదగినది.

భావములకెల్ల దీక్ష్ణతయను గుణంబొండు గలదుగదా! కోపము, గర్వము, కామము, మొదలగునవెల్ల హెచ్చుతగ్గులుగలిగి వర్తిల్లుననుట సుప్రసిద్ధము. ఉదా. కోపము ప్రారంభించి యల్పముగ నున్నను మొగముజేవురించును. కన్నులెఱ్ఱవారును, ఉఱిమిచూతుము. ఇంకను నెక్కిన బెదవు లదరసాగును. మఱియు నుద్ధురమాయెనేని శరీరమంతయు నదరును. మాట లనాయాసమునరావు. పండ్లు కొఱుకుదుము. వెండియు గోపముచ్ఛ్రిత మయ్యెనో కొందఱు నోరనురుగులు