యుపకారముం జేయునవియయ్యును అవి నిజమైన యన్యోన్యతా వర్గములుగావు. మఱి కృత్రిమములు. సామాన్యములైన కంపెనీల వంటివి. అనగా ధనసంపాదనముందప్ప నింకేయర్థమును బాటింపనివి.
విక్రయములకై స్థాపింపబడిన వినియోజక (లేక విభజన) పరస్పర సమూహములుగాక ఉత్పత్తి - అనగా వస్తురచనాదికళ - నెఱవేర్చుటకై యా క్రమము నవలంబించిన యుత్పాదక పరస్పర సమాజములుం గలవు. ఇవి విక్రయశాలలట్లు ఘనతరములుగావని యీ సంఘముల గుణదోషముల జర్చించు నవసరంబున సూచించితిమి. ఇందులకు చరిత్రాంశములును సాక్ష్యము నిచ్చుచున్నవి ఎట్లన;
ఇంగ్లాండులో 1890 సంవత్సరాంతముననున్న పరస్పర వర్గముల వివరం
- | సంఖ్య | సామాజికుల సంఖ్య | మూలధనము (సవరనులు) |
విభజన సమాజములు | 1418 | 10,26,912 | 10,607,432 |
ఉత్పాదక సమాజములు | 119 | 27,214 | 597,933 |
ఇతరములు | 16 | 62,929 | 10,56,587 |
వీనియొక్క వృద్ధివేగముందెలుపు నంశములు
సంవత్సరం | సమాజముల సంఖ్య | సమాజికుల సంఖ్య | మూలార్థము (సవరనులు) |
1866 | 915 | 174,993 | 1,046,310 |
1876 | 1165 | 507,857 | 5,304,019 |
1886 | 1296 | 835,200 | 9,297,506 |
1890 | 1554 | 1,117,085 | 12,261,952 |
పనివాండ్రచే నిండిన యీ సమాజములు మిక్కిలి తక్కువ వడ్డీకి 2,800,000 సవరనులను బ్యాంకీలు మొదలగు ఋణదాయి వర్గములనుండి వ్యాపారార్ధ మప్పుబడచినవి. ఇదిచూడంగా నికముందు మూలధనము లవారు కూలికి శ్రమకరులను నిలుపుకొనుటపోయి శ్రమకరులు వడ్డీయనుకూలినిచ్చి మూలార్ధములంగొని ప్రభువుల పదవిం జెందుదురేమోయని తోచెడిని!