పుట:Bhaarata arthashaastramu (1958).pdf/442

ఈ పుట ఆమోదించబడ్డది

బ్యాంకీలో 5 రూపాయలు వడ్డీరావలయునన్న నిక్షేపింపవలసిన మూలధనము 100 రూపాయలు.

కావున 1 రూపాయ వడ్డీరావలయునన్న నిక్షేపింపవలసిన మూలధనము 20 రూపాయలు.

కావున 100 రూపాయలు వడ్డీరావలయునన్న నిక్షేపింపవలసిన మూలధనము 2000 రూపాయలు.

అట్లుండుటచే నేడాదికి 100 రూపాయలిచ్చు తోటయొక్క వెల 2000 రూపాయలకన్న దక్కువ యగునా? సాధారణముగగాదు.

మఱియు 40 సంవత్సరములు గడచినవనుకొందము. దేశములో మూలధనము మిక్కిలిగా గూడినందున వడ్డీ 100 కి 4 రూపాయలుగా దిగెననియు, తోటలో ఫలితము జనసంఖ్య వృద్ధియగుటచే గిరాకితోడ వెలయు హెచ్చినదై 150 రూపాయలకు వచ్చె ననియు ననుకొందము. ఇప్పుడు తోటయొక్క వెలయేమి?

బ్యాంకిలో 4 రూపాయలు వడ్డీరావలయునన్న మూలధనము 100 రూపాయలు.

1 రూపాయ వడ్డీరావలయునన్న మూలధనము 25 రూపాయలు.

150 రూపాయలు వడ్డీరావలయునన్న మూలధనము 3750 రరూపాయలు.

తోటయందు లీనమైయుండు విలువయొక్క పరిమాణ మయ్యై కాలముల ఫలితము, వడ్డీ, వీని ననుసరించి యుండునదిగాని యచలంబుగాదు.

తోటయెట్లో వ్యవహారసంఘములలోని భాగములును విలువ విషయమున నట్లే. తొలుత మద్రాసు బ్యాంకీ కంపెనీగా నేర్పడినపుడు భాగమునకు 500 రూపాయలుగా వేసికొనికూడిరి. ఇపుడా బ్యాంకీభాగముల ధరలు 1500 రూపాయలకు మించియున్నవి. కారణ మేమియనగా:-