పుట:Bhaarata arthashaastramu (1958).pdf/379

ఈ పుట ఆమోదించబడ్డది

లితరులం జెందినను పాటుపడగలడు. ఎన్నియో దోషములపాలైన యీ కాలమందును నాలుబిడ్డలు, స్వజాతి, స్వదేశము మొదలగు వానియందలి గాఢానురాగంబు కతన బ్రాణములనైన విడువ సిద్ధముగ నెందఱుండలేదు? ఇట్టి సాహసములచే వీరేమి వారు కొనెదరు? కావున నర్థార్జనమునకు బరోపకార బుద్ధియే చాలును. స్వామ్యమనావశ్యకము. అట్లుండియు వర్తమానమున నెందుల కయ్యది తఱుచు వాడుకలోనికి రాకయున్నదనగా సమంచితమైన విద్యయు శిక్షయులేమింజేసి, మనుష్యులు పరిపూర్ణ జ్ఞానులైనచో సంఘ ప్రయోజనమందు దవిలిన మనసులుగలవారై సహజానురాగ భరితులౌదురు. చూడుడు! తేనెటీగలు, అవి సంఘ క్షేమమునకై పాటుపడుచుండుట సర్వజనవేద్యం గాదా? చీమలును నట్టివికదా? ఇట్టివి పరోపకార వ్యాపార పారీణములైయుండగా మనుష్యు లారీతినుండువారేల కాగూడదు? మఱియు బురోవృద్ధియందొక లక్షణముగలదు. అదేదన, కాలక్రమేణ మనుజుల యనురాగములు విస్తరత వహించుచున్నవి. ఆదిని కుటుంబము మీది కలవరమేగాని వేఱొండుగానము. తరువాత వంశములని వర్ణములని యింకను దూరస్థము లైన సమూహముల పర్యంతము యోచనలు వ్యాపించినవి. ఇప్పుడన్ననో వంశమేల, వర్ణ మేల, నేనేల, నీవేల? దేశము ప్రదీప్తముగ నుండినం జాలునను మహామమత యనేకుల నావేశించియుండుట తెల్లమేగద! మఱికొందఱు జాతి మత దేశాది విభేదములం బాటించుటయు బూర్ణుల బుద్ధిగాదనియు సర్వజనులయందును నిశ్చలంబైన ప్రేమజూపుట సనాతనంబైన ధర్మంబనియు, లోకమునంతయు నక్కచెల్లెండ్రుగా గాకున్నను నన్నదమ్ములుగా జూడ వలయునని యొకరాద్ధాంతము హృదయముల గాకున్నను గొననాలుకలమీదనైనను నాట్యమాడించు చున్నారు. ఎట్లును ముఖ్యవిషయ మియ్యది. కాలక్రమేణ, లోకము పక్వమగుచు రాను రాను, ఉపకారబుద్ధి అహమున నాటియుండునదియైనను తీగవలె దూర