పుట:Bhaarata arthashaastramu (1958).pdf/352

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రదుకట్లు. దంపతులకుం బ్రణయ కలహము లెంత కఠినముగా ముదిరి దేహమునకు మనస్సునకు గాయములు గలుగజేయున ట్లప్పుడప్పుడు గలుగుచున్నను నాయలలచేత బొంగి ప్రళయమాపాదింపక సంసార సముద్రము మొత్తముమీద శాంతముగా నుండును గదా? వ్యవహార సముద్రము నిట్టిద.

"అట్లేని జాతిభేదముల నేల ఖండింప వలయు? హిందువుల వర్ణధర్మంబులు దేశంబున కహితంబులన నేల?" యని యేపూరిపుడకయైన నానికగగుదురు నాయని పెదవు లెండరోయువారు కొందఱు ప్రశ్నింతు రేమో! దీనికి వేయివాదములేల? రెండుచాలును. 1. శ్రమవిశ్లేషమునకును దీనికిని దారతమ్య మధికము. చూడుడు! మన సర్వకళాశాలలో విద్యార్థులకు విడుదు లేర్పఱుప వలయునన్న నొక్కొక్క తెగకు నొకమండపమును వంటశాలయు నిర్మించుట విధిలేని క్రియ. దీనిచే మనకందు మర్యాద భాగహారముగాదు. గుణకారము. అనగా శ్రమవ్యయములు గుణీకృతము లగుచున్నవిగాని విభక్తములు గావనుట స్పష్టము. 2. "ఎట్లుండిననేమి? దూర దూరముగనుండి మీపోకల మీరును మాపోకల మేమును బోవుచున్నను దేశీయ విషయముల మాత్రము కలసిమెలసి యేలయుండరాదు?" అని తలపోయు ప్రాజ్ఞులీ కురుక్షేత్రమున నున్నారు. మనసులేని పెండిలి మహాచారమను వారికి నిక్కమైన కలయికకు సమయము లెవ్వియను విషయమై యేమి తెలియును. తెలియబోలును? మఱియు నేలకాగూడదను సంభావన వమ్మగు వచనము. అనుభవమున నున్నదా లేదా యను విచారణ ముఖ్యమైన యంశముగాని "పూర్వముండెనుగదా! మంత్రతంత్రములచే మన పూర్వులమాడ్కి మఱల సృజింతము" అనునూహలు పిచ్చితలంపులేకావు, దుర్మార్గపు యోచనలునుగా నున్నవి. 1832 వ సంవత్సరము వఱకు నింగ్లాండులో రాజ్యతంత్రమంతయు బ్రభువుల యధీనమై యుండెను. ఆ సంవత్సరమున వర్తకులు మొదలగువారు