పుట:Bhaarata arthashaastramu (1958).pdf/246

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రపంచమున ఆహారసౌకర్యమునందు ఆంగ్లేయులు అమెరికనులును అగ్రగణ్యులు. వీరిలో గూలివారుసైతము దినమునకొకతూరియైన మాంసముం దినకుందురు. జర్మనీ ఫ్రాన్‌స్ రష్యా మొదలైన సీమలవారు జపానీయులును ఇంత చక్కగ జీవింపలేకపోయినను మొత్తము మీద నీవిషయమందు దేఱినవారే.

హిందూదేశము క్షామదేవతకు హృదయరంజక విహారస్థలము. ఈదేశమునందు జనులు తిండిలేక పరితపించు విధముజూడ ఱాతి గుండెయైన కరుగును. పనియు నందునకు దగినట్లు మిక్కిలిజబ్బు.

చిత్తూరుజిల్లా ప్రాంతములో నెల కైదురూపాయల జీతము లభించిన నది శుక్రమహాదశయనిపేరు. ఇక పెండ్లాము పిల్లలు వేఱుగ రెండు మూడు రూపాయ లార్జింతురేమో. ఈ యేడెనిమిది రూపాయలతో గిరాకిగానుండు కాలములో ఐదారుమంది యన్నవస్త్రాదుల యుక్తపరిమాణముల గొనవలయునన్న వితరణ ప్రసిద్ధమైన కల్పవృక్షమే కోమటియవతారమెత్తినంగాదు. మఱియు మిక్కిలిముఱికియై క్రిక్కిరిసిన యిండ్లలో నుండుటచేత అప్పుడప్పుడు వ్యాధులచే బాధితులై తిన్నగా దినము దప్పక పనికినిరారు. వ్యాకరణధోరణి నీవిషయము వాక్రుచ్చితిమేని వీరికి జనులతోగల సంధి వైకల్పికమేగాని నిత్యముగాదు. తుదకు బహుళమునుగాదు.

"ఆతురగాండ్రకు బుద్ధిమట్టు" అన్నట్లు సేవకులకు మిగుల గొద్దిగా తిండిబెట్టి పనిలాగజూచుట యజమానులయొక్క యాచారము. క్షుద్బాధయాఱి ముఖమునకు గాంతివచ్చునంత దిన్నవారు ఆకలిచే గృశించినవారు రెండుగంటలలో జేయుపనికన్న నెక్కువ యరగంటలో జేయగలరని యెఱింగినవారైనను "కాలవ్రయమైన నేమి రొక్కము మిగిలిన జాలును" అని తలచి కూలివారికొక ముద్దకు మారరముద్ద సంకటివేసి యదలించి పొలముల దున్నుటకో కోతకోపంపుదురు. చొఱవపనికైన తూగుచు జేయునదియే మేలనుట