పుట:Bhaarata arthashaastramu (1958).pdf/199

ఈ పుట ఆమోదించబడ్డది

వీరిచే పరాజితులై కర్మచ్యుతులైన జట్కావాలాలకన్న విద్యయందును గుణమందును గొంతకు గొంతమేలైనవారేగాన గడించిన సొమ్ములో మునుపటియంత కల్లంగడిలో గుల్లయౌటలేదు.

కావున యంత్రఫలంబులు తాత్కాలికోత్తర కాలికంబులని రెండువిధములు. అప్పటికి నష్టమైనను ముందునకు బ్రకృష్టమే యగుననుట మొత్తముమీద నొప్పుకొనవలసినదే.

యంత్రములచే సృష్టిక్రియ యతిత్వరితముగను హృద్యముగను నడచుననుట తెలిసినవిషయమేగాన విశేషించి వివరించుట యధిక ప్రసంగము. కాలికైన కట్టెబండిమేలు; కట్టెబండికైనను కోటిమడుంగులు ఆవిరి విద్యుచ్ఛక్తి వీనిచే బోవుబండ్లుమేలు. చేతిమగ్గముతో దినమున కొకచీరనేయుట బహుప్రయాస; యంత్రములతో గంటకు నూఱునేయుట సామాన్యకార్యము. మఱియు నమానుషములైనవియు యంత్రసాధ్యములు గోదావరివంతెన చెన్నపురిలోని రేవు వీనిర్మాణములో వేయబడిన ఇనుపదూలములు విశాలములైన బండలు మొదలగునవి మోయుటకు గ్రొత్తయాంజనేయు డావిర్భవించి రావలయు గాని మనకు సాధ్యమా? యుద్ధపునావలలో గుండుదెబ్బకు చీలకుండు నట్లు దట్టమైన యుక్కుపలకలు ప్రక్కలవేసి బిగింతురు. బిగియెక్కువ యగుటకై వానిలో బెజ్జములు వేయకయే మిక్కిలి గొప్పవైన చీలలను నీటిశక్తియంత్రములచే జొనుపుదురు. భీకరోద్యోగములు మాత్రమేనా? సుకుమారమైన చేతలన్ననో చేతలని నామమాత్రమేగాని చేతులతో నౌనా? గుండుసూదులు యంత్రసహాయములేక చేయవలయునన్న అలతియా?

పరుపలుకులేల? మనసాలెవాండ్రు వాసిదఱిగి వగపుల పాలగుటకు యంత్రవిస్తరమేకదా కారణము? యంత్రజంబుల యెదుర కరజంబులు నిలువలేవనుటకు నింతకుమించిన నిదర్శనమున్నె? పూర్వా