పుట:Bhaarata arthashaastramu (1958).pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

నట్టు మారుతములలెక్కగొనక అలలలక్ష్యపెట్టక పటువేగంబునం బోవు మహాగ్రామంబులోయన స్ఫారములును సర్వసామగ్రి సమేతములునునైన నావలును, కిరోసిన్ నూనె విద్యుచ్ఛక్తి వీనితో జనించిన గమనగాంభీర్యముగల మోటారులును, వ్యోమమార్గంబున గంటకు 60 మైళ్ళకన్న నెక్కువ దవ్వుబోవు మరుద్విమానములును ఇట్టి యాశ్చర్యజనక యంత్రశక్తిని దూరపు బ్రయాణములు పెఱటితోటకు బోయి వచ్చునంత సులభములైనవి. టెలిగ్రాఫ్‌లు టెలిఫోనులు, తంతులులేనివార్తలు మొదలగు సాధనములచే సముద్రములకు నావలి దిక్కుననుండువారితోను అనాయాసముగ పెండ్లాము బిడ్డలతో ముట్టడించినట్లు మాటలమార్చుకొనవచ్చును. కాలదేశములు పూర్వం బవిలంఘ్యములౌట పూర్వము జనులకు నెడబాటును పరస్పర సంబంధము లేకునికియు గలిగింప జాలియుండినవి. ఇపుడు వానిదెబ్బ అట్టె సాగదు. హనుమంతునకు సముద్రమెట్లో మనకు గాలదేశంబులట్లు. గోష్పాదతుల్యములు. ఇందుచే బ్రపంచమంతయు నొకటే అంగడి యయినట్లున్నది. ఐరోపాలో యుద్ధమునకు బ్రారంభించిరేని తత్క్షణమే యా వృత్తాంతము లోకమంతయువ్యాపించి ధరలెక్కుట తగ్గుట గావించును. రష్యాలో క్షామమనునప్పటికి మనకు వానలెంతగుఱిసిన నేమి? గోధుమలవెలలు తటాలున మీదికెగయుగదా! ఏలనగా రష్యావారును మనమును గోధుమ లింగ్లాండునకు బంపుదుము. రష్యాలో సున్నయైన ఇక "మనగోధుమలేగదా యింగ్లాండువారికి గతి" యని వెలలు నిలబెట్టితీతుము. అమెరికాలో నల్లకల్లోలములు పుట్టినవనుకొనుడు! అచ్చటి కెగుమతియగు సరకులవెల తగ్గును. అక్కడనుండి దిగుమతిగావచ్చువాని వెలలు హెచ్చును. ఇవి సంచలించిన వీనితో సంబంధించిన యితరవస్తువుల ధరలును తల్లడిల్లును. తొలుత మొత్తముల క్రయములు మాఱును. రాకపోక లెంతవడిగా నడుచునో అంతశీఘ్రముగ చిల్లరధరలును సంచలించును. ఇందుచేత