పుట:Bhaarata arthashaastramu (1958).pdf/160

ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు మూలధనము కాకపోవునా! కాదేని వస్తువు ఉద్దేశ్యమాత్రమున రూపుమాఱుట సంభవించు

మఱియు నాగేళ్ళు కత్తులు ఱంపములు వీనిని మూలధనమను టేల? తాముచెడక చాలదినములుండి ఇతరవస్తువు లుద్భవిల్లుట కాధారములౌటగాదె! గృహములు నట్టివియేకదా! వస్తూత్పత్తికై వినియోగింపబడినవి కాకున్ననేమి? తాము జన్మస్థానములుగా తమ నుండి సుఖానుభవము నిరంతరధారగా బ్రవహింపజేయును. ఈసుఖములు క్షణభంగురములు♦[1] తామోచిరంతనములు. సుఖము నాదాయమేకదా! రూప్యములనేనా ఆదాయమనుట? రూప్యములేల?

  1. ♦ తాత్కాలిక సుఖములును బ్రయోజనములేయైనను ఉత్కృష్టములుగావు. ఉత్కృష్టం లేవియనిన: దేశముయొక్క యుత్పాదశక్తిని వృద్ధిపఱుచు యంత్రములు. వ్యవహార తంత్రములు. సంఘాచారములు. రాజ్యాంగపద్ధతులు ఇత్యాదులు. ఇవి వినియోగానుభవములట్లు క్షణ భంగురములుగావు. మఱి నిరంతర సౌఖ్యదాయకములు. కావునసార్థకంబనగా స్థిరత వస్తు సమార్జనోపకరణంబు. బాణముల వేడుక యెంత యుల్లాసము గలిగించినను నది త్వరలో లయించునది. అ సెలవుతో నావునొకటికొన్న నాఱునెలలకైన పాలు సమృద్ధిగ ద్రావవచ్చునుగదా. వినియోగమును సార్థకము. నిరర్థకము నని ద్వివిధము. ఏవినియోగముచేత నుత్పాదనశక్తి వృద్ధిగాంచునో యది సార్థకము. ఉదా. మితభోజనము. దేనప్రజకును రాజ్యమునకును బలక్షయము ప్రాప్తించునో యయ్యది నిరర్థకము, అనర్థకరమన్నను దప్పులేదు. ఉదా. అమితముగ బౌట్టలు పగులునట్లు పదాఱుమారులు భుజించుట; వివాహాదులజేయు విపరీతపు సెలవు ఇత్యాదులు. మేరకుమించని సౌఖ్యరాసులు సార్థకములు ఇవి నిషేధ్యములనుట దుర్వచనము. శ్రమ వినియోగాది క్రియలు పునరుత్పత్తికి భంగకరములుగా నుండ గూడ దనుట యీ తారతమ్యములోని యాంతరభావము. కావున నమితభోగంబుల పొంతబోక యావశ్యక వినియోగముచే దృప్తినొందుట మంచిది. అవశ్యక వినియోగమును గాలదేశాదుల ననుసరించి పరిణమించునుగాని నిర్వికారంబు గాదు. ఉదా. అడవిమనుష్యులకు మానరక్షణముసైత మనావశ్యకముగా దోచును. ఐరోపాలోనిజనులు మాంసాశనము విడువరానిదందురు. ఇదిమనకు నసహ్యమనిపించును. మన యిండ్లలో నెల్లరు నొకకూటములో బంతిగా బరుండి నిద్రవోదురు. ఇంగ్లీషువారి యూహప్రకార మిది చెడ్డ ఱోత. ఇట్లగుట నావశ్యకము లివియని గుర్తించుట కష్టము. అయినను నొకవిజ్ఞప్తి:- నాగరికులు దెలివిగలవారు నవశ్యానుషేయములని నిర్ణయించునవియు తేజోమానోత్సాహాధిక్యమునకు ననుకూలములైనవియును అపరిహార్యములు. మఱియు ప్రకృత మిట్టివానియందు ప్రజలకు నబిరుచి లేకపోయినను అ విరక్తిమాన్చి యనురక్తి నొడగూర్చుటయ నాగరికతయొక్క లక్షణము. అట్టి రక్తి యంకురింపదేని వృద్ధి నశించును బీదలు అంబలితో దృప్తిసెందెదరని యా యంబలియు చింపిఱిగుడ్డలును జాలు నని యున్నవారెట్లు ప్రశస్తస్థితికివత్తురు? హెచ్చైనకోరికలు పాతకములుగావు. వికృష్టస్థితియే ధర్మము ధర్మమనియుంట యదింటిని మించిన యాఱవ మహాపాతకము.