పుట:Bhaarata arthashaastramu (1958).pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

నలక్ష్యముగా జూచుటచే సంఘము క్షీణించును. అది కారణముగ దామును దుర్గతిపాలవుదురు. స్వలాభాపేక్ష తనలోనే యుదయించి తనకే ముప్పుదెచ్చునట్టి ఏడవయంతశ్శత్రువు. దేశఘనత నాకాంక్షించువారు రాష్ట్రంబుతోడ దామును ఉదారస్థితింగందురు. ఐరోపావారి ధనకనక సమృద్ధిగాంచి వారు పదార్థతృష్ణం దగిలినవారని యెన్నుట సామాన్యమేయైనను ఇది పొరబాటు. అర్థములు ఫలముగా వాలారి నంతనే అవియే వుద్దేశభూతములని అనుమానించుట హేత్వాభాసంబు.

4. దమము. అనగా అప్పటప్పటికి సర్వమును మ్రింగివేయక వస్తువుల మిగులబెట్టుటకై ఆశల నాపుట.

5. దేశమున సౌరాజ్యము. అట్లుకాదేని

         క. "తన ధనమిదియని యూఱడి
             మన బరిణయమాదియైన మహితోత్పవముల్
             గొనియాడనెవ్వరికి వ
             చ్చునె జనపాలుండు లేనిచో నిర్భయతన్?"

అన్నట్లు స్వామ్యరక్షణము లేమింజేసి ఎవ్వరును గూడబెట్ట నుద్యమింపరు. మఱి "గతకాలము మేలువచ్చు కాలము కంటెన్" అని గ్రుక్కుమిక్కనక మెక్కి యూరకుందురు. పూర్వము మనదేశమున కీగతి పట్టియుండుటచేతనే ప్రాచీనులు జీవితంబు బెట్టిదంబగుట "సంసారము చంచలము; ఎండమావులట్లు మిథ్య; దు:ఖసాగరము; వర్జనీయము" అని విధిలేక తలపోసియు, నిరాశతో జీవంబుల నిలుపుట దుర్భరంబుగాన, స్వర్గంబున సుఖంబులు వడయుదమని కొందఱును; అంతకుం బేదయైన మనసుగలవారు నిర్వాణత్వంబుజెంది నిర్వికార స్థితినుంటయే విమోచనమార్గంబనియు, ఇట్లు నానావిధముల తత్త్వంబులం బ్రకటించి మనశ్శాంతిం బ్రతిపాదించిరి. ప్రాణమానములు భద్రములుగానప్పుడు, మానములో నేమున్నది ప్రాణములో నంతకు మున్నే యేమున్నది యని విరక్తివహింపక యేమిచేతురు?

6. సంఘస్థైర్యము. జాతిమతాది భేదములచే భిన్నులమై వారి వారి సొంతములగు కుటుంబముమీదదప్ప నితరములయెడ ననాదరణ