పుట:Bhaarata arthashaastramu (1958).pdf/104

ఈ పుట ఆమోదించబడ్డది

యింపజేయు క్రమములు విద్యలును వీరు సృష్టించినయవిగావు. సంఘముచే దరముల పర్యంతము కొంచెము కొంచెముగ వికాసమునకు దేబడినవి. అట్లగుట వినియోజక శేషమునకు నిజమైన మూలాధారము ప్రతిమనుజుని నావరించియుండు సంఘముయొక్క స్థితిగతులు. వీనికే "ఆవరణస్థితు" లని పేరు.

నేను, నాకర్మము, నాసుఖము అని వ్యక్తివాదము సేయువారికి నిది యలంఘ్యమైన ప్రమాణము. మనకుగల జ్ఞానము, చతురత, సుఖదు:ఖావహసమయములు ఇత్యాదు లన్నియు గొంతమాత్రము స్వయంకృషిచే నిర్మింపబడునవియైనను మొత్తముమీద నావరణముచే నిర్మితములనుట యభేద్య న్యాయములలో నాద్యమైన న్యాయము. దీనికిం దృష్టాంతములు పెక్కులేల? బ్రాహ్మణకులము నందు బుట్టిన వానినైన మాలనియింట చిన్నప్రాయముననె చేర్చిన యెడల మాలబుద్ధియేకాని బ్రహ్మజ్ఞానము వానికింబట్టదు. బ్రాహ్మణావరణమునందు బెంపునకు వచ్చినవాడైన మాలబుడుత డాజ్ఞానము సంపాదింపలేకున్నను సంపాదించిన వానివలె వేషము దాల్చినవాడైన నగును. ప్రతిమనుజుని యొక్కయు స్వభావమనబడుదానిలో ముక్కాలు వంతు ఆవరణభావమేయనుట తగ్గించి చెప్పబడినమాట.

ఆవరణము

మనప్రయత్నములేకయ యార్థికస్థితిగతులయందు నిర్ణాయకముగనుండు సంఘాదిసంబంధియైన హేతుజాలం బావరణంబునాబడు. ఆవరణకృతంబైన శేషంబునకు ఆవరణశేషంబని పేరు. ఆవరణం బపౌరుషేయంబుగాదు.

ఆవరణములోన గణనీయ తత్త్వములు రెండు. ప్రకృతి, సంఘము. ప్రకృతిచే సంఘమును, సంఘముచే బ్రకృతియును మార్పులు సెందుననుట పూర్వోదితము.