ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

భారత నీతికథలు - రెండవ భాగము.

మున్నగు భక్తి వినయ సూచకంబులం తనయెడఁ జూపని శక్తింజూచి, రాజాభిమానంబునఁ గల్మాష పాదుఁడు తెరువు దొలంగుమని యీసడించుచుఁ బలికెను. “రాజా! ఎట్టి 'రాజులైనను బ్రాహ్మణోత్తము లేదురగుగు దెంచు సప్పుడు భక్తి యుక్తులై నమస్కరించి ప్రియంబులు వలికి మార్గం బోసంగెదరు. ఇదియే యుత్తమ ధర్మము. దీనిని నీ వేల యెఱుంగకున్నావని" శక్తి బదులు చెప్పిను. అంతఁ గల్మాష పొదుండు వాని పై నాగ్రహించి తన చేతనున్న కశకోలతో సమ్మునీంద్రుని దీవ్రముగా వేసెను. ఇట్లవమాని తుండైన శక్తియు నపొర కోపారుణిత సయనుండై వానిం జుఱచుఱిఁ జూచి, ఓరీ ! రాజాధమా! నీవు రాక్షసాకారంబున నకారణంబ నాకపకారంబు గావించితివి. కావున రాక్షసుండవై మనుష్యమాంసం బాహారంబుగా నుండు” మని శపించెను. అప్పుడు రాజు వానిని వసిష్ఠ తనయునిగా గ్రహించి తన యపరాధంబుసకు వగచుచు ముకళిశహస్తుడై 'మునీంద్రా! నన్ను మన్నించి యీ శాపంబుఁ బాపుకొను సుపాయంబును ప్రసాదింపు” మని ప్రార్థింప సాగెను. అంతలో వసిష్ఠునకు బద్ధవై రుండై న విశ్వామిత్రుఁ డచ్చటికి వచ్చి వారలు తన్నెఱుంగకుండ నంతర్హితుడయి యుcడి, కింకరుండను నొక్క రక్కసుని రాజు హృదయంబునఁ బ్రవేశింపుమని యాజా పించెను. విశ్వాతు నా దేశంబునను శక్తి శాపంబునను గింకరుఁడు కల్మాషపాదుని యంతరంగంబున నా వేశింపఁగల్లెను. -- -