ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

116 - - భారత నీతికథలు - రెండవ భాగము. ప్రతిజ్ఞ ప్రకారము భీముఁడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి యంత మొనర్చెను. పాండవ సైన్యముల యం దును ననేకులు గడ తేరిరి. ధరమూగులైన పొండునందను లేవురును భగవంతుడైన శ్రీనారాయణుని యనుగ్రహంబునఁ బాణాపాయము లేకుండ సుఖజీవులైరి. నారాయణుని యను మతంబున యుధిష్ఠిరుఁడు సమస్త రాజ్యమునకును బట్ట భద్రుండె ధరపరిపాలనంబు సేయుచు, సోదరులతోడను బవిత్రశీలయగు పాంచాలీతోడను సుఖముగాఁ గాలము గడ పెను. సీ. ఆయురర్థులకు దీర్ఘాయుర వాప్తియు నర్థార్థులకు విపులార్థములును ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రాప్తియు వినయర్థులకు మహా వినయ మరియుఁ బుతార్థులకు బహు పుత్రసమృద్ధియు సంపదగుల కిష్టసంపదలును, గావించు నెప్పుడు భావించి వినుచుండు వారికి నిమహా భారతము భక్తియుక్తులైన భాగవతులకు శ్రీ వల్లభుండు భక్తవత్సలుండు భవభయంబు లెల్లం బావి పౌరసుడు సిద్దిగరుణతోడఁ జేయుచుండు. ఓం శాంతి, శాంతి, శ్శాంతి..