ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

భారతనీతికథలు - రెండవ భాగము


బురోహిత ప్రభావంబును దమకెఱింగింప వలసినదనికోరిరి. గంధర్వుఁడిట్లుచెప్ప నారంభించెను.

సూర్యునకు సర్వశుభలక్షణ లక్ష్మి తాంగియగు తపతి యను కూఁతురు గలిగెను. కాలక్రమంబున నక్కన్యారత్నము రూపగుణ విద్యాసమృద్ధినియై వర్ధిలుచు, యౌవన ప్రాపయై నంతనే యాదిత్యుఁ డామె వివాహమునుగూర్చి విచారంప సాగెను. సర్వవిధములఁ దపతి కనుగుణుండైన పతిం బడయుటకుఁ దపనుఁడు నిరంతరము ప్రయత్నించుచుండె, అట్టియెడ భరతవంశజుండును , అజామీళుని కుమారుండునగు సంవరణుండనురాజు తపతి గుణరూప విద్యావిశేషములను విని యామె యందు బద్ధాను రాగుఁడయ్యెను. కాని తనప్రభుత్వ గౌరముచేత సామాన్యరాజకన్యను బడయఁగల్గినట్లు సంవరణుం డాదిత్యకన్యను బడయఁజాలడుక దా! అందుచే సూర్య భగవానుఁడు తనకుఁ బ్రసన్న డై తపతీసతిని దన కనుగ్రహించుటకైయా రాజు జపోపవాసాది విధులతో నిత్యమును వాని నారాధించు చుండెను. భగవంతుఁడైన భాస్వంతుడు వానిభక్తి కెంతయు మెచ్చి గగన మండలమున నధిక ప్రభతో నేను వెలుంగునట్లే భూమండలమున సుప్రసిద్ధుఁడై వెలుంగు సంవరణుండే నా పుత్రికిం దగిన వరుండని నిశ్చయించుకొనెను.

ఇట్లు సూర్యోపాసనాయత్త చిత్తుండై రాజు కాలము గడపుచు నొకనాడు మృగయా వినోదార్థము వనమునకరిగెను.