పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

బోవలెనని యత్నము జేయునపుడు, 'స్పిత్ హెడు' రేవులోనికి గాలిచే గొట్టబడెను. 'యార్ మతు' పట్టణమువద్ద కొందఱు ప్రయాణికిలకు గలిగిన విపత్తును బెంజమిను సాంతముగా వ్రాసెను. దీవిలో గొంతసంచరించి, సాయంకాలమున యార్‌మతునకు వీరురాగా, రేవునకు బోయెడి మార్గమును దప్పినట్టు వీరికిదోచెను. దేనిమూలమున రేవు విరివియైనదో, యా కయ్యను వీరుదాటి కయ్యముఖద్వారమున నున్న దోనెవద్దకు వచ్చిరి. దానిపైకి దాటి, పట్టణములోనికి బోవలె నని వీ రభిప్రాయపడిరి.

'గడపువాడు లేనందున, వానిగుడిసెకు మేము వెళ్లితిమి. వాడు మంచమునెక్కి పరుండియుండెను. మమ్ములను దాటింప ననెను. అప్పుడు, దోనెను లాగి తెచ్చి, దానిని గడుపుకొని పోవుటకు నిశ్చయించి, నీటియొడ్డునకు మేము వచ్చితిమి. దోనె నీటికి 50 గజముల దూరమున గుంజకు గట్ట బడియున్నందున, దానిని మేము లాగ లేక పోతిమి. దానియొద్దకు బోవలెనని బట్టలు తీసి వేసితిని. దానిదగ్గిఱకు తీసికొనిపోవు రాతికట్టుమార్గమును దప్పినందున గుండెలు మోయ, బురదలో దిగబడితిని. తుదకు గుంజ వద్దకు వచ్చితినిగాని, దోనె గొలుసుతో గట్టబడి తాళము వేయబడియున్నందున, చాలదిగులు పొందితిని. అన్ని విధముల దోనెను తీయవలె నని యత్నించితిగాని, ప్రయోజ